Powered By Blogger

28 మార్చి, 2014

నేను... ప్ర్రియమైన శత్రువుని




అవును నేను ప్రియమైన శత్రువుని

నిహారికల్లో నిగూఢంగా దాగిన
మంచుతునకల్లా తాకిన
భావవల్లరుల ప్రేమికుడిని
ఆ తలపులు దోచే ప్రియమైన శత్రువుని

రంగుల ఊహల్లో తడిసి
వర్ణరేఖాచిత్రాల్లో ఒదిగి
హరివిల్లుని జల్లుగా కురిపించిన
కుంచెతో స్నేహించే ప్రియమైన శత్రువుని

కనుల నుంచి జారిన
కన్నిటిని మొత్తం దోచి
కలల వలలు విసిరి
కనికట్టు చేసే ప్రియమైన శత్రువుని

మౌనమేఘాలను కరిగించి
అధరాల మధ్య గొడవ పెట్టి
మాటల మంత్రాలు జల్లి
మాయ చేసే ప్రియమైన శత్రువుని

శశిరేఖల్లో చీకటిని పరిహసించి
శిశిరాన్ని వసంతంతో కప్పేసి
ఆ ఆనందం అందరికీ పంచేయాలన్న
అత్యాశ ఈ ప్రియమైన శత్రువుకి

జాబిలినీ తీయగా మోసం చేసి..
వెన్నెల పువ్వులు దొంగిలించి
అందమైన నవ్వులకు బహుమతి
ఇవ్వాలన్న కోరిక ఈ ప్రియమైన శత్రువుది


 


15 కామెంట్‌లు:

  1. ప్రియమైన శత్రువు ప్రణయవాక్యాలు మదినిదోచాయి.

    రిప్లయితొలగించండి
  2. నిజంగానే ప్రియమైన శత్రువు మీరు . ఒప్పుకుంటున్నాం .. అక్షరాల విరివానల్లో మత్తు జల్లారు మీరు ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రియమైన మిత్రుడి కన్నా... ప్రియమైన శత్రువే ఎంతో ఆనందాన్నివ్వగలడు.
      అందుకే నేను ప్రియమైన శత్రువునే.

      తొలగించండి
  3. శిశిరాన్ని వసంతంతో కప్పే ఈ శతృవును ఎవరు వదులుకుంటారూ?
    స్నేహ కుంచెతో మదురంగా చిత్రీకరణ చేసీ ఈ భావార్పణను ఎవరు కాదనగలరూ,
    చాలా బాగుంది కవిత సతీష్ జి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా ఆలస్యమైంది. రిప్లైలకి. అందరూ క్షమించాలి. కొన్ని ముఖ్యమైన పనుల వల్ల
      ఈ మధ్య కాలంలో బ్లాగ్ లోకి రావడం లేదు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  4. శశిరేఖల్లో చీకటిని పరిహసించి
    శిశిరాన్ని వసంతంతో కప్పేసి..
    super expression sathish..:):)

    రిప్లయితొలగించండి
  5. కనుల నుంచి జారిన
    కన్నీటిని మొత్తం దోచి
    కలల వలలు విసిరి
    కనికట్టు చేసే ప్రియమైన శత్రువుని
    ఇలాంటి ప్రియమైన శత్రువుని అందరూ కోరుకుంటారు. :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్మగారికి ప్రత్యేక క్షమాపణలు. మీ అందమైన స్పందనకు బదులు
      ఇంత ఆలస్యంగా ఇస్తున్నందుకు. కొన్ని సంక్లిష్ట పరిస్థితులకు
      ఎదురీదుతున్నాను. అందువల్లే ఈ ఆలస్యం.

      తొలగించండి
  6. ఏమై పోయారు సతీష్ గారూ .. ఈ మధ్య మీ బ్లాగ్ మిత్రులందరినీ మరచినట్లున్నారు . తీరికలేని పనుల్లో మునిగి

    పోయారా ఏంటి ? ప్రియ మైన శత్రువు నే మీ బ్లాగ్ కి కాపలా పెట్టారు . త్వరగా మీ కలానికి పదును పెట్టండి మరి .

    ఈ మధ్య నేను బ్లాగ్ కి ఎక్కువ సమయం కేటాయించ లేకపోతున్నాను .. లేకపోతె మిమ్మల్ని ముందే ఇలా అడిగేదాన్ని ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎన్నికల హడావిడి వల్ల... ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పోయంండీ... అందువల్లే బ్లాగలేదు.

      తొలగించండి
  7. శశిరేఖల్లో చీకటిని పరిహసించి
    శిశిరాన్ని వసంతంతో కప్పేసి
    ఆ ఆనందం అందరికీ పంచేయాలన్న
    అత్యాశ ఈ ప్రియమైన శత్రువుకి..../// వావ్...

    రిప్లయితొలగించండి
  8. సతీష్ కొత్తూరి గారి రచనలంటే .....
    అందరికీ ప్రియమే మరి.

    "శశిరేఖల్లో చీకటిని పరిహసించి
    శిశిరాన్ని వసంతంతో కప్పేసి
    ఆ ఆనందం అందరికీ పంచేయాలన్న
    అత్యాశ ఈ ప్రియమైన శత్రువుకి "

    గొప్ప భావాలున్న పదాలివి .
    ఇలా రాయడం మీకే చెల్లు.
    మంచి భావుకత ఉన్న రచయితలు మీరు.

    హార్దిక అభినందనలతో.
    *శ్రీపాద

    రిప్లయితొలగించండి