ఈ
సృష్టికి మూలం స్త్రీ మూర్తి.
స్త్రీ లేని
ప్రపంచం లేదు.
సృష్టిని
నిర్మించిన అసలైన దేవతను ఎంత
స్మరించినా తక్కువే.
ఆ షకాలంలో
ప్రపంచాన్ని నడిపించిన
స్త్రీలను దేవతలు అన్నాం.
దేశ వ్యాప్తంగా
18 చోట్ల
వెలిసిన ఆ అమ్మను అష్టాదశ
పీఠాలుగా కొలిచాం.
కాలంతో పాటు
స్త్రీమూర్తి ఏదో ఒక రూపంలో
తన శక్తిని చాటుతూనే ఉంది.
ఈ ప్రపంచంలో,
సృష్టిలో
కనిపించే దేవత ఎవరైనా ఉంటే
అది అమ్మే.
ఆ అమ్మే
ఆదిపరాశక్తి.
ఆ అమ్మే అయిగిరి
నందిని. యుగాలు
మారాయి.. శక్తి
స్వరూపాలు మారాయి.
వేద కాలంలో
అగస్త్యుడి ధర్మపత్ని
లోపాముద్ర...
ఋగ్వేదంలో
ఋక్కులు దర్శించిన తొట్ట
తొలి మహిళా వేదర్షి.
ఆమె స్ఫూర్తిగా
వేదంలో చాలా మంది ఋషికలు
కనిపిస్తారు.
వేదకాలంలో
మహిళలకు ప్రాధాన్యత లేదన్నది
సుద్ద తప్పు.
మహిళా శక్తి
ఎంత గొప్పదో సతీ సావిత్రి
నిరూపించింది.
యముడినే
ఓడించి.. భర్తను
రక్షించుకుంది.
పురాణాల్లో
యముడిని ఓడించినవాడు ఒక్కడేై
పరమశివుడు.
ఆ తర్వాత
ఓడించింది కేవలం సావిత్రి
మాత్రమే.
శివుడంత శక్తి
కలిగిన సావిత్రి అపర చండికేగా.
సీత...
సహనంతో కూడా
రాక్షసులను అంతం చేయొచ్చని
నిరూపించింది.
భార్య,
తల్లి ఎలా
ఉండాలో ప్రపంచానికి చాటి
చెప్పింది.
అందుకే ఇప్పటికీ
సీతను సీతగా కాదు సీతమ్మగా
చూస్తాం. అసలు
ద్రౌపదే లేకపోతే...
ఆధునిక మహిళకు
ఇంత శక్తి ఉండేది కాదేమో.
స్త్రీ
తలుచుకుంటే...
స్త్రీ
కళ్లెర్రచేస్తే..
యుద్ధాలే
జరుగుతాయని నిరూపించింది.
మహిళలపై
జరుగుతున్న వివక్షలపై యుద్ధం
చేసిన తొలి ధీర వనితగా నిలిచింది.
గర్భంలో
ఉండగానే ఆడపిల్లను చిదిమేస్తున్న
రోజులివి.
అలాంటిది 13
వ శతాబ్దంలో
ఓ వనిత అపర కాళీలా కత్తి పట్టి..
శత్రువులను
చీల్చి చెండాడుతుందని ఊహిస్తామా?
ఓరుగల్లు ఖిల్లాలో
మహిషాసుర మర్ధిని...
రుద్రమగా
అవతరించింది.
కాదనగలమా.
చరిత్రలో
తొలి మహిళా రణభేరి రుద్రమ.
నేటి మహిళల
ధైర్యానికి రూపం...
రుద్రమ.
శత్రువుల
మోసానికి చిక్కి భర్త వీర
మరణం పొందాడు.
తననూ కబళించాలని
చూశారు. అప్పుడు
భర్తతో పాటు వీరమరణమే సుఖమనుకుంది
చిత్తోర్ గఢ్ మహారాణి
పద్మిని.
ఆత్మగౌరవంతో
ఆత్మార్పణం చేసి...
ఇప్పటికీ
దేవతగా మన్ననలు అందుకుంటోంది.
ఆనాడు మొఘల్
చక్రవర్తి అక్బర్ వస్తున్నాయంటే...
కత్తులు
కిందపెట్టి సంధిచేసుకునేవారు.
అలాంటి సమయంలోనూ
దేశ భక్తే మిన్న అనుకుంది..
గోండ్వానా
రాణి దుర్గావతి.
అక్బర్‌కి
ఎదురెళ్లి ముప్పు తిప్పలు
పెట్టింది.
ఆమె ధైర్య
సాహసాలకు అక్బర్‌కు దిమ్మతిరిగింది.
అలా స్వతంత్ర
పోరాటాన్ని తొలిసారి పరిచయం
చేసిన అపర చండీ...
రాణి దుర్గావతి.
ముస్లి పాలకుల
అరాచకాలకు దేశం బలవుతున్న
సమయంలో...
దేశాన్ని
రక్షించే వీరుడి కోసం భరతమాత
ఎదురు చూసింది.
ఆ సమయంలో
సాక్షాత్తూ ఆ దుర్గమ్మే
జిజాబాయిలా అవతరించిందా
అనిపిస్తుంది.
తన కొడుకు
శివాజీని నిప్పులు చిమ్మే
ఫిరంగిలా తయారు చేసి...
శత్రువులపై
అణ్వాయుధంలా వదిలింది.
అప్పుడప్పుడే
పోర్చుగీసు మ్లేచ్యులు భారత
దేశం తీరప్రాంతాల్లో పాగా
వేసి... ఆక్రమణ
చేస్తున్న సమయం.
ఇది రానున్న
విపత్తుకి ప్రమాద ఘంటికలా
బావించింది మలబార్ రాణి
అబ్బక్క.
మహిళే..
కానీ...
చాముండేశ్వరిలా...
పోర్చుగీసు
వారిని తరిమితరిమి కొట్టింది.
ఆమె తొట్టతొలి
స్వతంత్ర పోరాట యోధురాలన్న
సంగతి మరుగున పడిపోడం బాధాకరం.
కర్ణాటక
ప్రాంతంలో కిట్టూర్ అనే
చిన్న రాజ్యానికి రాణి చెన్నమ్మ.
తాము స్వతంత్రంగానే
ఉంటామని,
బ్రిటీష్
అరాచకాలు భరించమని తెగేసి
చెప్పింది.
యుద్ధం
ప్రకటించారు బ్రిటిష్ వారు.
50 ఏళ్ల వయసులో
కత్తి పట్టింది,
గుర్రమెక్కి
మూడు సార్లు బ్రిటీష్ సేనలను
తరిమికొట్టింది.
చెన్నమ్మ
గుండె ధైర్యం ముందు...
బ్రిటీష్
ఫిరంగులు పనిచేయలేదు.
చెన్నమ్మ
స్వతంత్ర స్ఫూర్తి ఇప్పుడెక్కడా
వినిపించదు.
రామఘర్‌ని
పాలించే రాణి...
రాణీ అవంతి
బాయి లోథీ.
బ్రిటిష్
సైన్యానికి చుక్కలు చూపించిన
అపర కాళీ.
ఇప్పటికీ
దేశ వ్యాప్తంగా లోథాలు ఆమెను
దేవతగా కొలుస్తారు.
ఆమె ధైర్య
సాహసాలు మహిళా శక్తికి చోదకాలు.1857
తిరుబాటులో
వీరులంతా అజ్ఞాతంలో ఉండాల్సి
వచ్చింది.
ఝాన్సీలో
పరిస్థితులు అల్లకల్లోలంగా
ఉన్నాయి. ఆ
సయమంలో బ్రిటిష్ వారిపై
విరుచుకు పడిన చండిక...
లక్ష్మీబాయి.
ఒకవైపు బిడ్డను
పట్టుకుని..
మరోచేత కత్తి
పట్టి... శత్రువుల
తలలు నరికింది.
మాతృత్వం ఒక
కోణం, ధైర్యం
మరో రూపం అని నిరూపించిన
ఆదిశక్తి...
లక్ష్మీబాయి.
ఈ పోరాటాల
స్ఫూర్తి...
స్వతంత్ర
పోరాటంలో ఎంతో మంది మహిళలను
నడిపించింది.
కస్తూర్బా...
గాంధీ
అడుగుజాడల్లో నడిచి స్వతంత్రం
కోసం జీవితాన్నే త్యాగం
చేశారు.
వంటింటికే
పరిమితమైన బాలికలను బయటకు
తీసుకొచ్చి...
వారికి చదువు
అవసరమని భావించి...
విద్యాబ్యాసం
చేయించిన తొలి మహిళా టీచర్
సావిత్రీ బాయి పూలే.
ఇప్పటి మహిళలు
విద్యలో రాణిస్తున్నారంటే
ఆమె వేసిన బాటలే.
అక్కడి నుంచి
ఎంతో మహిళలు చరిత్రలో నిలిచారు.
దేశాన్నేలారు.
అత్యంత
శక్తివంతమైన నేతలుగా దేశాన్ని
నడిపించారు.
మాకు సరిహద్దులు
లేవంటూ అంతరిక్షంలో అడుగుపెట్టారు.
తలుచుకుంటే
ఏదైనా చెయ్యగలరు మహిళలు...
కుంగిపోని
మనస్తత్వం స్త్ర తత్వం.
ఒలంపిక్స్‌లో
ఇప్పటి వరకు మనకు వచ్చిన
పతకాల్లో ఎక్కువగా సాధించింది
మహిళలే. ఓ
వైపు భ్రూణ హత్యల్లో ఎంతో
మంది మహాలక్ష్మలు నలిగిపోతున్నా...
అపరి చండికలై
ఏదో ఒక రూపంలో తమ శక్తిని
చాటుతున్నారు.
ఆ నేపథ్యంలో
అయిగిరి నందిని...
స్తుతిని ఆ
కాలం దేవతల నుంచి
ఈ కాలం దేవతల వరకు అందరినీ
స్మరించదగ్గదిగా భావించాం.
మా ఆలోచనకు
ప్రతిరూపమే ఈ ఆల్బం.
పిల్లల్లో
ఇప్పటి నుంచి మహిళల పట్ల మంచి
ఆలోచనలు నేర్పించాలంటే ఇలాంటి
ఆల్బంలే దారి.
మానసికంగా
ఎదుగుదల లేనివారే...
యాసిడ్
దాడులకు పాల్పడుతున్నారు.
అందుకే పాఠశాల
విద్యనుంచే ప్రార్థనలో
భాగంగా...
బాలురకు
ప్రత్యేకంగా మరో ప్రతిజ్ఞ
చేయించాలి..
అది...
"యత్ర
నార్యస్తు పూజ్యంతే రమంత
తత్ర దేవతాః"
ధన్యవాదాలు.