Powered By Blogger

7 మార్చి, 2012

మర మనిషికి మన మెదడట....!!!!!

మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో దానికే తెలీదు. దాన్ని తీసుకొచ్చి
మరమనిషి తలలో పెడుతున్నారు.. కొందరు శాస్త్రవేత్తలు
ఇన్నాళ్లు మరమనుషుల తల రాతలు మన చేతుల్లో ఉండేవీ (ప్రోగ్రామింగ్)
మన మెదళ్లు వాటికి తగిలించాక వాటి తలరాతలు అవే రాసుకున్నాయంటే
శంకర్్ సినిమానే.  విజ్ఞానం అనేది ప్రయోజనానికా వినాశనానికో అర్థం కాదు.
దేశంలో సరైన వైద్యం అందక రోజుకు కనీసం రెండు లక్షల మంది
చనిపోతున్నారు. సరైన విద్యా సదుపాయాలు లేక రోజు కనీసం లక్ష మంది
పిల్లులు బడిమానేస్తున్నారు. ఇప్పటికీ సరైన మరుగు లేని ప్రజల సంఖ్య కోటి.
దేశంలో కరెంటు లేని పల్లెలు 6 లక్షలు. ప్రపంచంలో సరైన పోషకాహారం లేని
వారి సంఖ్య 3 కోట్లు. భారత్లో 20 లక్షలు. మంచి నీళ్లు లేక దాహంతో చస్తున్న
మనుషులు ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటిన్నర. క్యాన్సర్ కి, ఎయిడ్స్ కి ఇప్పటికీ మందు కనిపెట్టలేకపోయారు. రక్తం లేక చనిపోతున్న వారి సంఖ్యే రోజుకి 2 లక్షలు. పెట్రోల్ కి సరైన ప్రత్యామ్నాయం కనుక్కోలేకపోతున్నారు. కళ్ల ముందు
కనిపిస్తున్న సూర్యరశ్మిని విద్యుత్ గా మార్చుకునే విస్తృత ప్రయోగాలు చేయలేకపోతున్నారు. మనిషికి నిత్యం అవసర పడే ప్రయోగాలు పక్కన పడిపోయాయి.
మరమనిషిలో మన మెదడు పెడితే మాత్రం ఏ ప్రయోజనం... అసలు ప్రయోగాలు అటకెక్కుతున్నాయి.. కొసరు ప్రయోగాలు ఖర్చు దండుగ...