నిన్నో మిత్రుడు అష్టవిధనాయికల గురించి అడిగాడు. బిజీబిజీగా పనిచేస్తున్న నాకు.. అష్టవిధనాయికల వైపు దృష్టి వెళ్లిపోయింది. ఆ నాయికలు వారి హావభావాలు సుడిగుండంలా నన్ను చుట్టేసి ఏదో అసువుగా ఓకవితావేశాన్ని సృష్టించేశాయి.
ప్రేయసీ.. ప్రతి రోజూ తొలిరేయనిపించే
ముగ్దమనోహర చంద్రవదన...
ప్రవరాఖ్యునికే మన్మధ శరమా
నా తలపులలో నీ ఎడబాటు
చూడవలెనని.. తీయని బాధకు
నిను గురిచేయవలెనని కుట్రచేసినానే చెలి
వెన్నెల కురిసిన.. వలపుల వేళ
నీ చెంత చేరక నే జాగు చేసీ.. చేసిన వేళ
ఎదురు చూపుల్లో అలసి సొలసి
నీ కనులు సోలి... తూలిన వేళ
వచ్చినానే చెలి.. చూశాను నీ భంగిమలో
విరహాగ్నిని... అందున నాపై అసలు వలపుని
విరహోతఖంటిత...!!!
నీపై వలపు జల్లులు కురిపించిన
ఈ మనసు మరో చిన్నదాని వంక
క్రీగంట చూడగనే నీ మదిలో ఎంత కలకలం
ఊరికినే నిన్నుడికించ... నీ కన్నులలో
ప్రేమాగ్రహోదకాన్ని కురిపింపవలెనని
చేసిన కుట్రకు క్షంతవ్యుడను...
ఆ చిగురుబోడితో సరసనాటకమాడితినని
అంతలోనే అలకబూని.. దరిచేరక
విరహాగ్ని రేపకే... నా ఖండిత నాయిక...!!!
నా గోడు పట్టదని అలకబూనేవు..
నాకు వంత పాడవని నిష్టూరమాడేవు
సత్యభామలా మూతిముడుచుకునేవు
కొంగుపట్టుకు తిరగాలన్న మాట
మదిని దాటనీయలేక... విలవిలలాడేవూ
అంతరార్థమర్ధమైనా.. అర్ధమవనట్టు
నేనుండ... తెగ విసవిసలాడేవూ..
నా ప్రేమ పరవశాన్ని పెనవేసుకునేందుకే
కాదా... నేను మాత్రం... పంతం బట్టేను గానీ
నిను కాదనగలనా... హన్నన్న..
రేయిముసుగులో... పరువాల వాకిట
నీ బానిసనే కాదే... నా స్వాధీన పతిక
అనుక్షణం నీ తపనలతో రగిలిందే
నా మనసు... అక్కడ నీకూ అటులనే కదా
నాకు తెలుసు... విధివశాత్తు నీకు నాకు
నడుమ ఇన్ని రోజుల అగాధమా..
ప్రతీ క్షణమూ యుగమై.. భారమై.. నినునను
విడదీసే శత్రువై... ఓ కాలమా కరిగిపొమ్ము
ఈ విరహవేదన నే జాలలేను... నా సఖిని
ఎడబాటులో బలిచేయలేను.. కనులారా
క్షణాలతో యుద్ధం చేసి.. నిమిషాలను కడతేర్చి
గంటల పనిపట్టి.. రోజులు కరిగించి నా తలపుల్లో
ఇన్నాళ్లు నిరీక్షణ శిక్ష వేసినందుకు... ఓ ప్రోషిత పతిక
వస్తున్నా ఇదిగో... నులివెచ్చని పూలపడకింట.. మరుల గొలుపు
సౌగంధికా... నీ దాసుడను... వేయగలవు.. మధురమైన శిక్ష
అచటిచటెచటంటే అచటకే వచ్చి అచ్చట
ముచ్చట తీర్చితిని కదే... విరహసరస
అయిన.. అచటకెందుకు రాలేదని
మూతిముడుపెందుకే అలకల చిలక
కాటుక కనులు కలువల మొలక
ఇంతంటే చాలు అంతంత అలిగి
కడివెడు కన్నీళ్లతో నా మనసున
కళ్లాపి చల్లి... విలవిలలాడకే... విప్రలబ్ధ
నీకు తెలుసో లేదో... మనసు పడ్డ
సుందరాంగి.. కొంగు వెంటే మగడుంటాడని
తెలుసుకోవే... రంగవలిక
జామురాతిరి నీవనుకునికి పరపడతిని
బాహువుల బంధించితి... చింతించితి
తప్పు తెలిసి తడబడి ఉరికి ఒక్క చెంగున
ఇంటపడక ముందే నీ కంటపడితి..
అహో నా ఖర్మకాలి... నాపై ఎంత గాఢమైన
ప్రేమ నీకు.. పరస్పర్శా ఊహే నీకు పరమ కంపరము
అసలు కథ చెప్పిన వినకే.. మొదటే అనుమానము
తగదే... అనుమాన వనిత... కలహాంతరిత.
నిజము తెలిసి... అనుమానించితినే అని..
బాధపడి.. బెంగ పడి.. వలవల ఏడపెందుకే లలన..
నా అలక తొలగించ నీ కన్నీటికి సాధ్యమాయేనా..
అధరామృతాలను గ్రోవితే గానీ... నా బాధ తీరునా...
ఆహా.. ఏమిది.. పున్నమి జాబిలి నేలకు వచ్చినదా
వెన్నెల ఆకారం దాల్చి నా ముందు నిలిచెనా..
మరులు కూర్చిన మన్మధ శరమా..
నడివచ్చిన శృంగార నైషధమా..
బృందావన మరీచికా.. అభిసారిక..
నీవు వచ్చెవరకు నేను రానని
పోటీ పెట్టకే సగభాగమా..
కాస్త.. అలకల ఆటలు సాగినా...
ఓటమి ఖాయం.. అందాన్ని బంధింప
నేనే నీ చెంతకు పరుగున వచ్చెద...
అష్ట విధ నాయికలు, జనార్ధనాష్టకం.. ఈ రెండు పెదబాలశిక్షల్లో ఎప్పుడో చిన్నప్పుడు చదివినపుడు
తెలియలేదు. కానీ.. ఇప్పుడు తెలుస్తోంది. ఆ నాయికలను తలచుకుంటేనే కవితలు ఉప్పొంగుతున్నాయి. మన సాహిత్యం శక్తి అలాంటింది.
విరహోతఖంటిత
భర్త చెప్పిన వేలకు రాలేదని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీ .
ఖండిత నాయిక
తన భర్త రాత్రంతా పర స్త్రీతో సంభోగించి రతి చిహ్నాలతో కనబడిన మగడిని చూసి దుఖించే స్త్రీ.
స్వాధీన పతిక
తాను చెప్పినట్లు విని , నడుచు కునే భర్త గల స్త్రీ.
ప్రోషిత పతిక
దూరం లో ఉన్న భర్తను తలుచుకుంటూ విరహం తో రగిలి పోయే స్త్రీ. వాస్క సజ్జిత దూరాన ఉన్న భర్త చాలా కాలం తర్వాత వస్తున్నపుడు పడక గదిని అలంకరించి భర్త రాక కోసంవిరహంతో ఎదురు చూసే స్త్రీ.
విప్రలబ్ధ
రమ్మన్న చోటికి ప్రియుడు రాకపోతే విరహం తో బాధ పడే స్త్రీ .
కలహాంతరితభర్త ఎంత చెప్పినా వినకుండా అనుమానించి చివరకు తప్పని తెలుసుకొని భాద పడే స్త్రీ.
అభిసారిక
అందంగా అలంకరించుకొని ప్రియుడి దగ్గరకు వెళ్ళేది, లేదా తన వద్దకే ప్రియుడిని రప్పించుకోనే స్త్రీ.