Powered By Blogger

4 జనవరి, 2014

ఇట్లు...నీ, నేను...



నేను...
నీ శ్వాసని...
నీ గుండె చప్పుళ్ల కావలిని...
నీ కథలో అక్షరాన్ని...
నీ వ్యధలో కన్నీటిని...
నీ నీడని... తోడుని...
నీ కలలో అలని...
నీ నుదుటిపై కుంకుమని...
నీ కనుల కాటుకని...
నీ పెదవిపై మాటని...
నీ మనసుని...
నీ ఆలోచనని...
నీ ప్రేమ రూపాన్ని...
నీ అభిమానాన్ని...
నీ చిరుకోపం కారణాన్ని...
నీ అలకలో అల్లరిని..
నీ చిరునవ్వుల జల్లుని...
నీ మమకారం ఆకారాన్ని...
నీ ఉషోదయాన్ని...
నీ సంధ్యాసరాగాన్ని...
నిశీధిలో నీ పున్నమిని...
నీ ధైర్యాన్ని...
నీ ఓదార్పుని...
నీ ఆశలు మోసే పల్లకిని...
నీ నేనుని...
నీలో ప్రతీ అణువుని...
నీలో సగాన్ని...
                                        నా ఆనందం నీది...
                                        నీ కష్టం నాది... 
                                                         ఇట్లు
                                                         నీ... నేను