Powered By Blogger

4 జనవరి, 2014

ఇట్లు...నీ, నేను...



నేను...
నీ శ్వాసని...
నీ గుండె చప్పుళ్ల కావలిని...
నీ కథలో అక్షరాన్ని...
నీ వ్యధలో కన్నీటిని...
నీ నీడని... తోడుని...
నీ కలలో అలని...
నీ నుదుటిపై కుంకుమని...
నీ కనుల కాటుకని...
నీ పెదవిపై మాటని...
నీ మనసుని...
నీ ఆలోచనని...
నీ ప్రేమ రూపాన్ని...
నీ అభిమానాన్ని...
నీ చిరుకోపం కారణాన్ని...
నీ అలకలో అల్లరిని..
నీ చిరునవ్వుల జల్లుని...
నీ మమకారం ఆకారాన్ని...
నీ ఉషోదయాన్ని...
నీ సంధ్యాసరాగాన్ని...
నిశీధిలో నీ పున్నమిని...
నీ ధైర్యాన్ని...
నీ ఓదార్పుని...
నీ ఆశలు మోసే పల్లకిని...
నీ నేనుని...
నీలో ప్రతీ అణువుని...
నీలో సగాన్ని...
                                        నా ఆనందం నీది...
                                        నీ కష్టం నాది... 
                                                         ఇట్లు
                                                         నీ... నేను

 

 

15 కామెంట్‌లు:

  1. బాగుంది మీ కవిత చిన్ని పదాలతో

    రిప్లయితొలగించండి
  2. అన్ని "నీ" లు మీలోనే పదిలం.... :-) కవిత బాగుందండి

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. ధన్యవాదాలు శృతి... మీ కొత్త కవిత కోసం ఎదురు చూస్తున్నా...

      తొలగించండి
  4. నీలో ప్రతి అణువునీ అన్న్నారు కదా... ఇక మీరు వేరు కానే కాదు, సగం అస్సలే కాదు బాగుంది మీ భావం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిరాజ్ గారు... మీ భావం నా భావం కన్నా బాగుంది. థాంక్యూ.

      తొలగించండి
  5. చిన్నగా... చిన్ని పదాలు...
    మిన్నగా... అన్ని భావాలు...

    చెలిమితో...

    please call me on
    8686998899 or
    9247503670 for
    giving me some
    blog guidance...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా.. నేను మీకు కాల్ చేస్తాను. ఆదివారం ఫ్రీ ఉంటాను. ఆ రోజు ఉదయం చేస్తాను రావు గారు.

      తొలగించండి