ఓ మనసా....
ఆశలు సమాధి అయ్యాయని చింతించకు
కంటతడి ఆరలేదని కలతచెందకు
బాధకు అంతేలేదని అంతం కాకు
ప్రపంచం పగబట్టిందని అలుసు చేసుకోకు
ఓ మనసా....
గుండెలో బాధ బరువు పెరిగితే
దించేసుకో అని సులువుగా చెప్పలేను
ఒక్క చిరునవ్వుతో చెంపమీద తడి
తుడిచేసుకో అని తెలికగా చెప్పను
ఓ మనసా....
ఓదార్పు కోరే హృదయం విలువ తెలుసు
అంతర్ముఖాన నిరాశ రూపమూ తెలుసు
కాలం గాయం చేస్తే ఆ మనోవ్యధేంతో తెలుసు
కరడు గట్టిన విధి మిగిల్చే గుండెకోతా తెలుసు
ఓ మనసా....
ఎద రొదల రంపపు కోతకు మందేలేదా
చెరలో బందీ అయిన స్వేచ్ఛకు విముక్తి రాదా
ఆలోచనల యుద్ధానికి కన్నీరే శాంతి కాదా
నీకు నువ్వే ఓదార్పు, సాంత్వన కదా...
ఓ మనసా....
అయినా ఏనాడైనా అవకాశం ఇచ్చావా
కుమిలికుమిలి నీలో నువ్వే కన్నీిరయ్యావు
ఆ కన్నీటికే వ్యధను కలిపి సిరా చేశావు
నీ మనసు కాగితంపై మళ్లీ ఆ కన్నీటినే పరిచావు
ఓ మనసా....
నీ మనసుకే మనసు లేదు
అందుకే ఆ అంతులేని కథకు...
అంతం వెదకలేకపోతున్నాను...
కానీ.. ఓ ప్రయత్నం మాత్రం చేశాను
ఓ మనసా....
ఓ సాయంత్రాన.. రుధిరాకాశాన్ని చూస్తూ
నా మనసుని తెల్లకాగితం చేసి..
నా ఆనందాన్ని రంగుల సిరాతో కలిపి
మనసు కథ రాయడం మొదలుపెట్టాను...
ఓ మనసా....
నా కలం నుంచి సిరా రాలేదు
రంగుల బదులు కన్నీరు ఒలికింది
అంతులేని కథకు వ్యధ తోడైంది
కాలమే చెప్పలేనిది చెప్పాలనుకుంటే...
మరో కన్నీటి కాగితం తయారైంది...
రుధిరాకాశం మరింత ఎర్రబడింది...
ఓ మనసా.... నా మనసూ చీకటిలో కలిసిపోయింది
సతీష్ గారు మనసుని అంతలా సమాధానపరచిన మీరు చివర్లో....కన్నీటితో కాగితం తడిచింది అనడం ఏంటో అర్థం కాలేదు. కవిత మాత్రం అసాంతం చదివేలా రాసారు. బాగుందండి.
రిప్లయితొలగించండిచివరికొచ్చేసరికి.. ఆ మనసుని ఎలా సమాధాన పరచాలో నా మనసుకి తెలియలేదండి.
తొలగించండిసుఖాంతం చేద్దామనుకుంటే... అదేంటో... నాకు తెలియకుండానే విషాదాంతమే అయింది. నా మనసు నా మాట వినలేదు.
ముందుగా మీ బ్లాగ్ టాగ్ లైన్ పదం చాలా నచ్చింది:-) "కథలా సాగిపోయే జీవితంలో మలుపులెన్నో" Good One:-)
రిప్లయితొలగించండిధన్యవాదాలు శృతి...
తొలగించండిhmmm...
రిప్లయితొలగించండిమీ భావం అర్థమైంది ఫణిగారు. వీడేంటి.. వాటి ఏటిట్యూడ్ కి అస్సలు సింక్ కాని కవిత
తొలగించండిరాశాడనేగా. విషాదం నుంచి మొదలెట్టి సుఖాంతం చేద్దామని ట్రై చేస్తే.. అది కాస్తా
బాలచందర్ సినిమాలా తయారైంది. విషాద కథకి శుభం కార్డు వేయడం కష్టమే...
మీ హృదయ క్యాన్వాస్ పై మానసిక చిత్రం అద్భుతంగా ఉంది, చూడటానికి భావుకతా నయనాలు కావాలి
రిప్లయితొలగించండినిజానికి నిరాశావాదాన్ని నా మనసు దరిదాపుల్లోకి రానేరానివ్వను. ఎందుకో ఆ రోజూ ఈ కవిత రాస్తూ నిరాశలోంచి ఆశావాదానికి వచ్చేందుకు చాలా ప్రయత్నించి విఫలమయ్యాను. ఈ కవితను మళ్లీ సుఖాంతం చేస్తూ మరొకటి కూడా రాశాను.. కానీ దీనంత బాగోలేదు.
తొలగించండిఫస్ట్ ఇస్ బెస్ట్. అని.. ఇలాగే ఉంచేశాను. బట్.. ఇందులోని భావాలకు... నా నిజభావాలకు
అసలు సంబంధం లేదు. ఒకరి ప్రేరణతో ట్రై చేశాను. విచిత్రమేంటంటే.. ఇంతకు ముందటి నా పోస్టుల కన్నా.. ఈ పోస్ట్ ని చాలామంది బాగుందని మెచ్చుకోడం. భలే ఆనందాన్నిచ్చింది. థాంక్యూ మాడమ్.
మీకో విషయం అర్దం కావటం లేదు , నిరాశా వాదాన్ని మీ మెదడు నిరాకరిస్తుంది దానికి మనస్సు కూడా కొంత సహకరిస్తుంది, అయితే మెదడి మాట వినకుండా మనస్సు రాస్తే ఇలాగే ఉంటుంది,:-))
రిప్లయితొలగించండిమీరన్నారు కదా నేను కొంచం ఎక్కువ మాట్లాడుతాను అని (నా బ్లాగ్ కామెంట్ లో) అలాగే నేను కొంచం ఎక్కువ రాస్తాను, సర్దుకు పోవాలి తప్పదు, ఎంతైనా ఓ గూటి పక్షులం(కవులం)
ఎక్కువ మాటాడితేనే మనుషులు అర్థమవుతారు. మౌనంలో శూన్యం తప్ప ఏముంది చెప్పండి.
తొలగించండిమీలా నిక్కచ్చి అభిప్రాయాలు చెప్పేవాళ్ల కోసమే నేను రాస్తున్నది. నిజంగా నా మెదడు మాట వినకుండా రాసిందే ఇది. ఒక నిరాశావాదికి ఎంత ఆశావాదాన్ని నూరిపోసినా... చివరికి మిగిలేది ఆశో, నిరాశో... తెలియని పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది. సైకాలజీ మీద కాస్తో కూస్తో అవగాహన ఉంది. ఆ తోవలోనే వెళ్లి తర్కంలో చిక్కుకున్నాను. చాలా విలువైన అభిప్రాయాలు మీవి... మిరాజ్ గారు.