రంగుల అలవా, చిలిపి కలవా
కుంచెకు చిక్కిన అల్లరివా
వర్ణాలకే వర్ణన నేర్పిన కొంటెవా
పల్లెపడుచుదనాల ఎంకివావయసు గుండెకోతవా...ఎవరు నీవు... ?
వసంతానికి లంగాఓణి వేసినట్టు
వెన్నెలంతా ఓ చోట పోతపోసినట్టు...
చిగురు లేతదనమంతా రంగరించినట్టు...
పాదారేళ్ల ప్రాయం చినబోయేట్టు..
అందానికే అసూయ పుట్టేట్టు... ఎవరు నీవు...?
కలలో చిక్కిన చిన్నదానివా...
ఉలితో చెక్కిన శిల్పసౌందర్యానివా...
వాకిలిలో ఓరకంట దాగిన బిడియానివా...
అల్లరి కథలు చెప్పే మల్లెల పరిమళానివా...
రంగుల బందిఖానాలో చిక్కిన సోయగమా.. ఎవరు నీవు ?
ప్రణయ గీతాల పల్లవివో...
వలపు రాగాల సరిగమవో...
కవనకేళిలో పదాల పడికట్టువో...
ఎద నర్తనశాలలో నాట్య భంగిమవో..
మందహాస మంజరివో.. ఎవరివో నీవు ?
ప్రాణం లేని శూన్యం కూడా
జాబిలి కోసం ఆరాటపడింది...
తన కౌగిలిలోనే బంధించి వదలనంది...
ప్రాణమున్న మనసే ఇది...
ఈ జాబిలి కోసం... ఆరాటం వద్దన్నా వినదే...
కానీ... అందని వర్ణలిఖితఖండ కావ్యానివి... ఎవరో నీవు ?
( ప్రముఖ తమిళ చిత్రకారుడు ఇళయరాజా వేసిన ఓ పల్లెపడుచు కాన్వాస్ చిత్రమిది)

.forblog.jpg)
అందంగా ఆమె ఎవరో అన్నీ మీరే చెప్పి ఇంకా ఎవరని అడుగుతారేం :-)...బాగుందండి కవిత
రిప్లయితొలగించండికాన్వాస్ లో చిక్కింది గానీ.. కళ్లకు చిక్కలేదు.. చిన్నది. కనిపిస్తే ఇంకెంత వర్ణశోభితమో.
తొలగించండిధన్యవాదాలు పద్మగారు.
beautiful...
రిప్లయితొలగించండిsatish, daya chesi word verification teesey.
తీసేశాను ఫణిగారు. ఇన్నాళ్లు చూసుకోలేదు. ఎలా ఉన్నారు.
తొలగించండిఅందమైన భావం మీ కవితలో....ఇంతకీ ఆమె ఎవరో ;-)
రిప్లయితొలగించండిఅదే కదా బాధ. ఎవరో. రంగుల్లో చిక్కింది చిన్నది. ఆ చిత్రకారుడి ఊహా సుందరో ఏమో.
తొలగించండిఎంతైనా అందం వేసే బంధంలో మనసు చిక్కుకుంటే అది జీవిత ఖైదేనండి... ధన్యవాదాలు
తెలుగమ్మాయి... అందమైన స్పందనకు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి