నాలో
ఉన్న నాలో ఇంకెవరో
ఆ
ఇంకెవరిలో ఇంకెందరో...
మనసు
పెనవేసిన చిక్కుముడుల..
మనోభావనల
సంగమాలలో
ఎందరెందరో...
అందరూ
కలిస్తే...
మళ్లీ...
నేనే...
అది
నేనే
ఆలోచనల
పరవళ్లలో కవిని...
భావావేశాల్లో
విప్లవ వీరుడుని..
కదిలిస్తే
కలకలం సృష్టించే
కలాన్నీ...
స్వప్నంలో
బహుదూరపు బాటసారినీ...
నేనే
అందాల
రాక్షసి ప్రియమైన శత్రువుని
వలపు
జల్లుల అల్లరి ప్రేమికుడిని
కన్నీటి
తడిని తడిమే స్నేహితుడుని...
మానస
వీధుల్లో రాధామాధవుడినీ...
నేనే
వెన్నెల
జల్లుల్లో వెచ్చని ఒడిని...
వన్నెల
ఊసుల్లో నులివెచ్చని తలపుని...
ఒంటరి
వ్యాహ్యాళిలో తుంటరి తోడుని...
విషాద
లోకంలోనూ చిరునవ్వుని....
నేనే
బంధాల
బంధనంలో అనుబంధాన్ని...
పరిచయాల
మబ్బుల్లో కరగని జ్ఞాపకాన్ని...
మనసు
తెమ్మెరల ఊహల్లో ఊహని...
నీ
భావాల విపంచిలో భావాన్వేషిణి...
నేనే
నాలో
ఇంకెందరో...
ఇంకెన్నో...
హరివిల్లు
రంగులు, నిశి
నీడలు
ఆనందవిషాద
భాష్పోత్సేకాలు
అంతంలేని
ఆలోచనల చిక్కుముడుల్లో
చిక్కుకున్న
నేను... అంతుచిక్కని
ప్రవల్హికను...