ఆశ నిరాశకి ఎంతదూరం
ఒక్క అక్షరమే అని తర్కం చెప్తుంది
ఒక్కోసారి తర్కాన్ని చూస్తే జాలేస్తుంది
అక్షరమే తేడా ఉంటే నిరాశ నీడగా
ఆశే ఉండొచ్చుగా... ఆశావాదంగా
ఆనందానికి విషాదానికి తేడా ఏంటి
ఆనందానికి అగాధం తవ్వితే
విషాద శిధిలాలు గాయం చేస్తాయి
అసలు గోతులే తవ్వుకోకుండా ఉంటే
విషాదానికే విషాదం మిగిల్చేది ఆనందం.
ప్రేమకి, భగ్నప్రేమకి అంతరమేంటి
మనసుకి మనసుకి ముడి ప్రేమ
ఆ ముడి తెగితే భగ్నప్రేమ
భగ్నప్రేమ... ప్రేమ తప్పు కాదు...
భావాలు కలవని మనసుల తప్పు
మాట-మౌనం ఏది మంచిది
మౌనంలో శూన్యం తప్ప ఏముంది
మాటల్లో అపార్ధాలు తప్ప ఇంకేమున్నాయి
మౌనం ఒక రాజీ, మాటల్లో నటన మరో రాజీ
మౌనం మాటగా మారితే సమాజం వెలివేస్తుంది
బంధాల్లో వాస్తవమెంత
బంధనాల్లాంటి బంధాల్లో స్వచ్ఛతేదీ
హిపోక్రసీ ముసుగుల్లో మోసం తప్ప నిజమేది
కష్టం సుడిగుండాలై తాకినపుడు
గుండెబరువు దించే స్వచ్ఛమైన బంధం కన్నీరే...
ఈ మధ్య మరీ ప్రశ్నలెక్కువైపోతున్నాయి
కానీ.. అసలు ప్రశ్నించొద్దు అంటున్నారు
ఇంకొందరు నవ్వుకుంటున్నారు..
ఇవి నా ప్రశ్నలు కానే కావు
ఎన్నో మౌనాలు నన్నడిగిన ప్రశ్నలు
ఒక్క అక్షరమే అని తర్కం చెప్తుంది
ఒక్కోసారి తర్కాన్ని చూస్తే జాలేస్తుంది
అక్షరమే తేడా ఉంటే నిరాశ నీడగా
ఆశే ఉండొచ్చుగా... ఆశావాదంగా
ఆనందానికి విషాదానికి తేడా ఏంటి
ఆనందానికి అగాధం తవ్వితే
విషాద శిధిలాలు గాయం చేస్తాయి
అసలు గోతులే తవ్వుకోకుండా ఉంటే
విషాదానికే విషాదం మిగిల్చేది ఆనందం.
ప్రేమకి, భగ్నప్రేమకి అంతరమేంటి
మనసుకి మనసుకి ముడి ప్రేమ
ఆ ముడి తెగితే భగ్నప్రేమ
భగ్నప్రేమ... ప్రేమ తప్పు కాదు...
భావాలు కలవని మనసుల తప్పు
మాట-మౌనం ఏది మంచిది
మౌనంలో శూన్యం తప్ప ఏముంది
మాటల్లో అపార్ధాలు తప్ప ఇంకేమున్నాయి
మౌనం ఒక రాజీ, మాటల్లో నటన మరో రాజీ
మౌనం మాటగా మారితే సమాజం వెలివేస్తుంది
బంధాల్లో వాస్తవమెంత
బంధనాల్లాంటి బంధాల్లో స్వచ్ఛతేదీ
హిపోక్రసీ ముసుగుల్లో మోసం తప్ప నిజమేది
కష్టం సుడిగుండాలై తాకినపుడు
గుండెబరువు దించే స్వచ్ఛమైన బంధం కన్నీరే...
ఈ మధ్య మరీ ప్రశ్నలెక్కువైపోతున్నాయి
కానీ.. అసలు ప్రశ్నించొద్దు అంటున్నారు
ఇంకొందరు నవ్వుకుంటున్నారు..
ఇవి నా ప్రశ్నలు కానే కావు
ఎన్నో మౌనాలు నన్నడిగిన ప్రశ్నలు
విరుద్దమైన రెండు భావాల మద్య "మౌనం " నలిగిపోతుంది.
రిప్లయితొలగించండిఏది నిజమే.. దేన్ని సమ్మతించాలో తేల్చుకోలేక "మెదడు" నలుగుతుంది,
ఎందుకు ఏదో ఒకదాన్ని ఎంచ్కోవాలీ, ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేయొచ్చుకదా అనే మీమాంసలో "మనస్సు" నలిగి పోతుంది.
ఇవన్నీ వెరసి మనల్ని నలిపేస్తాయి. అందుకే మనం అక్షరాలని ఆశ్రయిస్తాం , కొంత ఊరట చెందుతాం.
మీ ప్రశ్నలు ఆరోగ్యవంతమైనవే...:-))
అవును. రెండు భావాల మధ్య సంఘర్షణే మౌనం. నిజానికి మౌనంలో ధ్వని ఎక్కువ. అది అంతర్లీనంగా ఉండిఉండీ.. ఆ శబ్ద తీవ్రత పెరిగి.. గుండె వేగాన్ని పెంచి... శరీరాన్ని మన అదుపులోంచి తన అదుపులోకి తీసుకుంటుంది. ఏదో.. నాకు తెల్సిన సైకాలజీ. అంత సంఘర్షణను అనుభవించే కన్నా ఒక్క మాటతో ఆ మౌనాన్ని చేధించి నలిగిపోతున్న
తొలగించండిమనసుకి కొంతైనా సాంత్వన ఇవ్వొచ్చు అనిపిస్తుంది. పైనున్న భావోద్వేగాలన్నీ మనోమౌనం నుంచి పుట్టినవే. అందుకే మౌనం నాకు నచ్చనిది. మీ ఆరోగ్యకరమైన విశ్లేషణతో నా కవిత మరింత పదునెక్కింది అనిపించింది. నా బ్లాగులో చాలా చదివాను అని చెప్పారు. అంత కన్నా స్పందన, అభినందన ఇంకేముంది చెప్పండి. ముక్కుసూటిగా వచ్చే నా భావాలు అందరికీ నచ్చవు. మీ ఉన్నత వ్యక్తిత్వం వల్లే మీకవి నచ్చాయి. థాంక్యూ మీరాజ్ గారు...
మీ ప్రశ్నలు చాలా బావున్నాయి.
రిప్లయితొలగించండిఇంతకంటే గొప్పగా చెప్పాలనుంది కాని గ్రహించిన విషయానికి గొప్పగా స్పందించే భాషా పరిఙ్ఞానం నాకు ఇంకా వంటబట్టలేదు.
మీ లాంటి పెద్దలు కామెంట్ పెట్టడమే ఆశీర్వచనంగా భావిస్తాను. మీ బ్లాగులు చూస్తుంటాను.
తొలగించండితెలుగు వ్యాప్తికి మీర చేస్తున్న కృషి ఆదర్శప్రాయమైనది. నా భావాల్లో చిన్న తప్పైనా..
పెద్దతప్పైనా సరే.. మీ లాంటి వాళ్లు సరిదిద్దితే ఎక్కువగా ఆనందిస్తాను. ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిNo more questions.....అన్నమాట ;-)
రిప్లయితొలగించండిజీవితమే పెద్ద క్వశ్చన్ పేపర్. సమాధానాలు చెప్పక పోతే చివరికి మిగిలేది క్వశ్చన్ మార్క్.
తొలగించండిసమాధాన పరుచుకుంటూ బతికేయడం రాజీ అంటే జస్ట్ పాస్. మరో ప్రశ్న వేయకుండా ప్రాక్టికల్ గా సమాధానం చెప్తూ ధైర్యంగా బతకడం పోరాటం.. అంటే ఫస్ట్ క్లాస్. అసలే సమాధానమే లేకపోతే... ఫెయిలే కదండి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం సుమండి. అందుకే ప్రశ్న నా దగ్గరకు రాకముందే.. నేనే ప్రశ్న వెంట పరిగెడతా.. సమాధానం పట్టుకుని.... ధన్యవాదాలు పద్మగారు...
>>అక్షరమే తేడా ఉంటే నిరాశ నీడగా
రిప్లయితొలగించండిఆశే ఉండొచ్చుగా... ఆశావాదంగా
చాలా బాగుందండీ !
ధన్యవాదాలు వంశీకృష్ణ గారు. నా బ్లాగుకి ఆహ్వానం కూడా...
తొలగించండి