Powered By Blogger

6 ఫిబ్రవరి, 2014

ప్రియమైన జవరాలికి... మనసులో మాట




తొందరగా రా ప్రియా...
ప్రపంచమంతా చుట్టూ ఉంది
కానీ... నువ్వు లేనిది.. ప్రపంచమే కాదు
ప్రతి క్షణం ఒంటరితనం గుచ్చుతోంది...

నువ్వు లేని ఒక్క క్షణం
శూన్యంలో ఒక శతాబ్దం
అగాధంలో ఒక యుగం
ఆ క్షణాన్ని తుంచేస్తూ వచ్చేయవా....

రాత్రి ఆకాశం వైపు చూస్తున్నా...
నిండు పౌర్ణమి ఆ రోజు
కానీ... అది నాకు అమావాస్యలా ఉంది
నువ్వు లేవుగా... అందుకేనేమో

గాలిలో అస్పష్టంగా నీ రూపం
పరిగెత్తుకుంటూ వెళ్లా కౌగిలి కోసం
ఏదీ... పిచ్చీ.. అని వెక్కిరించిందా రూపం
నాలో వాయులీనమై... విరహాగ్ని రేపింది

దగ్గరుంటే కసుర్లు, విసుర్లూ
కాస్త దూరం పెరిగినా గుండె బరువు
ఎడబాటు చెప్పింది నాలో నేను లేనని
ఉన్నదంతా నువ్వేనని... అందుకే రా...

నా జ్ఞాపకాల దొంతరల్లో... నీవే
ఎన్ని చిలిపి తగవులు...
ఎన్ని వలపు అలకలు.
ఎన్నని చెప్పను... అదో ప్రేమకావ్యం

ఏడడుగులు, మూడు ముళ్లతో
ఇంత ప్రేమ బంధనమా...
నాలో సగభాగమంటారు గానీ... కాదు
నాలో నీవు, నీలో నేను... మొత్తం మనమే

నీ ఊసులు, చిరునవ్వులు....
కలలో లీలగా నను తాకితే...
నిజమనుకుని కనులు తెరిచా...
నిదుర రానంది చెలీ... నీవు లేనిది

ఆ దూర తీరాన నీవున్నావు..
కానీ, నీ మనసు సందేశం అందింది
నా మనసులో మాటే నీదని...
వీరహ వీణపై వేదన పలుకుతోందని

మరి జాగేలా చెలి...
ఎద తలుపులు తెరిచే ఉంచాను..
వలపు వాకిట నిరీక్షిస్తున్నాను
నీ రాక కోసం... ప్రేమతో...

                                                      















14 కామెంట్‌లు:

  1. "నాలో నీవు, నీలో నేను... మొత్తం మనమే" ఈ పదం చాలా చాలా నచ్చింది:-) మీ జవరాలికి మీ మనసులోని మాటలు తప్పకుండా వినిపిస్తాయి.. మాడంగారు ఊర్లోలేరా సతీష్:-)జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నావు:-) మీ జ్ఞాపకాల వెనుక ఉన్న భావం చాల బాగుంది:-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా ఆవిడ ఇంట్లోనో ఉంది. కానీ.. ఒకవేళ ఓ పది రోజులు దూరంగా ఉంటే నాకు కలిగే భావన ఎలా ఉంటుందా అని ఊహిస్తే.. ఇదిగో ఇలా వచ్చింది. అవును.. మరి.. భర్తలో భార్యలో సగమైనపుడు.. భార్యలో కూడ భర్త సగం ఉండాలిగా... అప్పుడే పరిపూర్ణ సంసారం. ధన్యవాదాలు శృతి...

      తొలగించండి
  2. అయ్యో ! సతీష్ గారు ఇన్నాళ్ళ తరువాత కాస్తంత తీరిక చేసుకుని పుట్టింటికి వెళితే మీ విరహ కవిత్వంతో కరిగించేసి రమ్మనకనే రమ్మనడం న్యాయమా...ఆలోచించండి....సమాజ సమస్యల గూర్చి విశ్లేషించే మీరు ఈ విషయాన్ని విశ్లేషించనట్లుంటే ........బ్లాగ్మిత్రులు ఊరుకుంటారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో రామా.. శ్రీదేవి గారు ఎంత మాట. మా ఇంట్లో నా శ్రీమతి గారి నిర్ణయాలకు పూర్తి స్వేచ్ఛ, గౌరవం ఉన్నాయి. ఇక పుట్టిల్లు అంటారా ఆ విషయంలోనూ తనకే పూర్తి స్వేచ్ఛ. నిన్న మా మిత్రుల మధ్య ఓ చిన్న డిస్కషన్ జరిగింది. పెళ్లికి ముందు నిరక్షరకుక్షి కూడా అమ్మాయిలపై తెగ కవిత్వాలు వల్లిస్తాడు. పెళ్లయ్యాక... భార్య మీద కవిత్వం రాసేంత ప్రేమ కొన్నాళ్లకు ఉంటుందా అని... డిస్కషన్. నిజమే అనిపించింది... ఆలోచించా... నాకు తన మీద ఉన్న లవ్ స్కేల్ ఎంత అని. తను నాకు దూరంగా ఎక్కువ రోజులుంటే నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆలోచిస్తే.. ఇలా వచ్చింది. ప్రేమలో ఆకర్షణ పాళ్లే ఎక్కువ. వైవాహికంలోకి వచ్చేసరి బాధ్యత పాళ్లతో కూడిన ప్రేమ పెరుగుతుంది కదా... అదే ఇది. ధన్యవాదాలు శ్రీదేవిగారు.. మీ స్పందన బాగుంది.

      తొలగించండి
  3. వావ్ .. సతీష్ గారు .. ప్రేమ మీ మనసులోనూ భావాల తుంపరల ను వెదజల్లుతున్నట్లు ఉంది .. బావుందండి .

    ప్రేమించిన వాళ్ళ కోసం ఎదురు చూడటం లో ఉన్న ఆనందాన్ని మీ అక్షర మాల లో దారం లా ఒదిగి పోయేలా చేసారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిగ్గా మనసులు కలవాలి గానీ రాధిక గారు... పెళ్లయ్యాక భార్య పంచే ప్రేమే అందంగా ఉంటుందండీ. ఎందుకంటే రెండు పార్శ్వాలు నేను చూశాను. నిజంగా ఎదురు చూపుల్లోనే మనసు నిజమైన ప్రేమ వ్యక్తీకరిస్తుంది. బహుశా అందుకేనేమో అక్షరాలు మీరన్నట్టు భావాల తుంపరలు వెదజల్లింది... ధన్యవాదాలు రాధిక గారు.

      తొలగించండి
  4. ఏడడుగులు, మూడు ముళ్లతో
    ఇంత ప్రేమ బంధనమా...
    నాలో సగభాగమంటారు గానీ... కాదు
    నాలో నీవు, నీలో నేను... మొత్తం మనమే
    పై భావాలను చదివితే తెలుస్తుంది, చక్కటి భావుకత్వం మీ సొంతమని.
    చాలా సుకుమారంగా, అందంగా ఉంది కవిత.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ లైన్స్ నేను... సొసైటీ పరంగా రాశాను. భార్య కన్నా భర్త ఎక్కువ ఎలాగో నాకైతే ప్రాక్టికల్ గా అర్థం కాలేదు. మేం ఇద్దరం జాబ్స్. నిజానికి నా కన్నా తనకే పన ఎక్కువ. డ్యూటీ నుంచి రావాలి... ఎర్లీ మార్నింగ్ వంట గింట.. మళ్లీ రాత్రి వంటలు.. బట్టలు, అంట్లు. నాకుండే బయటపనులు నాకూ ఉంటాయి. నేను ఇంట్లో సాయం చే్స్తా గానీ.. కొన్ని పనులు వాళ్లే చేయగలరు. మేం చేస్తామన్న చేయనివ్వరు కూడా. ఇంట్లోనే ఉన్న భార్యలకు అదే విధంగా వాళ్లకు తగ్గ పనులుంటాయి. అలాంటప్పుడు... భర్త భద్రత పరంగా ఎక్కువ.. భార్య బాధ్యత పరంగా ఎక్కవ కదా...ఇక సగాలెందుకు. అందుకే మొత్తం మనమే... ఎక్కువ తక్కువలనే మాటకు అర్థం పర్థం లేదు. ఆ భావనతో ఈ లైన్స్ ఇరికించా... అవే లైన్స్ అందరికీ నచ్చడం నాకు ఆనందం కలిగించింది. ధన్యవాదాలు ఫాతిమా గారు.

      తొలగించండి
  5. balancing both the worlds...
    impeccable...
    truly a master of arts...
    kudos...
    really...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యో అంత పెద్ద ప్రశంస. ధన్యవాదాలు. ఏదో చిన్నచిన్న అనుభవ సారాంశాలు. అప్పుడప్పుడు ఇలా రాసుకుంటే... ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుందామనే ఆలోచనలు. అంతే సర్.

      తొలగించండి
  6. అసాంతం కవితలో ఇరువురి ప్రేమభావాలు సమాంతరంగా కనిపించాయి. చక్కటి భావావిక్షరణని అందించారు.

    రిప్లయితొలగించండి
  7. "ఏడడుగులు, మూడు ముళ్లతో
    ఇంత ప్రేమ బంధనమా...
    నాలో సగభాగమంటారు గానీ... కాదు
    నాలో నీవు, నీలో నేను... మొత్తం మనమే"

    - అవును నిజమే మరి . మంచి రాగాలతో అల్లి " రావే రాగమయీ" అంటూ పాడారు. ఎంత కాదనుకున్నా.... హృదయం కాస్తా పులకరిస్తుంది. ఈ కవిత నాకు బాగా నచ్చింది సతీష్ గారూ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ విరహావేశంలో రాసిన ప్రేమలేఖ. హృదయం అప్పుడప్పుడూ ఇలా కొట్టుకుంటుంది. నండూరి వారు చెప్పినట్టు గుండె గొంతుకలోన కొట్టుకుంటాంది.... ధన్యవాదాలు శ్రీపాద గారు.

      తొలగించండి