ఆ కసాయి కళ్లు చూస్తున్నాయి
ఆ కళ్లకు మరో రెండు జతల కళ్లు తోడయ్యాయి
ఆ కళ్లలో సంస్కారం లేదు, సభ్యత లేదు
అవి మంచిని ఏనాడు చూసిన కళ్లు కావు
ఆ కసాయి కళ్లు...
భావోద్వేగాలకు ఏనాడు చెమర్చలేదు
అసలా మాటే వాటికి తెలీదు
తాగొచ్చి తండ్రి తల్లిని కొడితే చూసిన కళ్లవి
నాగరిక సమాజంలో ఆనాగరిక ఆనవాళ్లవి
విద్యని వెక్కిరించిన సంస్కార హీన కళ్లవి
మద్యం మత్తు కైపులో ఎర్రబడిన కళ్లవి
నీలి చిత్రాల ఉన్మాద క్రీడ ఇష్టం ఆ కళ్లకి
ఆడపిల్లలంటే ఆటబొమ్మలు ఆ కసాయి కళ్లకి
ఆ కసాయి కళ్లు మత్తుగా చూస్తున్నాయి
చీకటిలో కలిసిపోయి వెంబడిస్తున్నాయి
వెంబడిస్తున్నారని పాపం ఆ అబలకి తెలీదు
దట్టమైన అడవి కాదది... జనారణ్య నగరం
అక్కడా మృగాలుంటాయని తెలియదు... పాపం.
అకస్మాత్తుగా ఆ కళ్లు ఆమెను చుట్టుముట్టాయి
ఆ కళ్లు వికృతంగా నవ్వాయి
భయం నీడలో తోడేళ్ల ఊలల్లా ఆ నవ్వులు
తప్పించుకునే పెనుగులాటలో ఓడిపోయింది... ఆమె
ఆ చీకటి నుంచి మరో చీకటిలోకి
బతిమాలింది, ఏడ్చింది, కాళ్లు పట్టుకుంది
తల్లిని, చెల్లినీ గుర్తుచేసింది...
నిస్సహాయ స్థితిలో మానసికంగా నిర్జీవమైంది
కనికరం లేని ఆ కసాయి కళ్లకు తల్లా, చెల్లా
కామోన్మాదంలో వాళ్లనూ చెరిచే రాక్షసులు.
ఆ కళ్లకి ఆమె కన్నీళ్లు కనిపించలేదు...
పెనుగులాటలో నగ్నంగా మారిన శరీరం తప్ప...
కుక్కలు శవాన్ని పీక్కు తిన్నట్టు...
నరమాంస భక్షకుల్లా ఆమెపై రుధిర క్రీడ
ఓ కంట ఆమె కన్నీటి ధార. అది కన్నీరో... రుధరమో
వికటాట్టహాసాల మధ్య నలిగిపోతూనే ఉంది
ఒకరు, ఆపై మరొకరు, ఇద్దరు, ముగ్గురు
అత్యాచారవికృతానికి ఆ చీకటి సాక్ష్యం
ఆ రాక్షసకాండను చూసి మృత్యువే భయపడింది
ఆమెను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది
అవును... ఆమె మరణించింది.....
ఉన్మాదుల శవక్రీడ ముగిసింది
ఆ కసాయి కళ్లలో పైశాచిక ఆనందం
మళ్లీ ఆ కళ్లు చీకటిలో కలిసిపోయాయి..
ఆమె కంటి నుంచి రుధరధార ఆగలేదు
అది అర్ధరాత్రి కాదు, అమావాస్యా కాదు
సమాజం ఇంకా నిద్రపోనూ లేదు...
భద్రత లేని నడిరోడ్లు ఉన్మాదుల రహదార్లు
బలహీనుల ఆక్రందనలతో నిండిన శ్మశానాలు
ఆ రాక్షసకాండను చూసి మృత్యువే భయపడింది
రిప్లయితొలగించండిఆమెను తన కౌగిలిలోకి తీసుకుని ఓదార్చింది
అవును... ఆమె మరణించింది.....
బ్రతకాలని ఉన్నా బ్రతకలేరు ,
బ్రతకాలని ఉన్నా బ్రతకనీయరు ,
బ్రతకాలని ఉన్నా బ్రతికినందుకు బ్రతికున్నంత కాలం హింసిస్తారు.....
కాబట్టే మృత్యువు ఒడిలోకి తీసుకుని ఓదార్చింది .
సతీష్ గారు మనసంతా చెమర్చింది .
అత్యాచారాలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఆడపిల్లలు ఒంటరిగా రోడ్లమీద కనిపిస్తే... భయమేస్తోంది. వాళ్లు ఇంటికి క్షేమంగా చేరారా లేదా అని. ఒక్కోసారి ఆందోళనగా అనిపిస్తోంది. రోడ్ల మీదే బార్లు ఉంటున్నాయి. అక్కడే తాగేస్తున్నారు. వాళ్లు ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా ఇంటికెళ్తారంటారా. హైదరాబాద్ లో ప్రతీ బార్ ముందు ఇదే సన్నివేశం. ప్రతీ వీధికో బార్ ఉంది. ఈ ప్రభుత్వం మరీ సిగ్గువిడిచేసినట్టుంది. అలా నడిరోడ్ల మీద తాగితందనాలుడుతుంటే.. ఎవరూ కంట్రోల్ చేయడం లేదు. అందుకే అత్యాాచారాలు..
తొలగించండిఎందుకో మీ కవిత చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచింది సతీష్ గారు .. నిజంగా పట్టపగలు కూడా ఆడపిల్లలు బయటకి రాలేని దుస్థితి .. ఎందుకిలా ? హక్కుల కోసం పోరాటం కాదు .. బ్రతకటం కోసం కూడా పోరాడాలా ? అలాంటి వాళ్లకి ఉరి శిక్ష కూడా సరిపోదే ..
రిప్లయితొలగించండిఒక్క క్షణం అలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఆడపిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకంరంగా అనిపించింది. ఆ నిస్సహాయ స్థితి అక్షరరూపమిస్తే ఇలా.
తొలగించండికానీ చాలా బాధపడుతూ రాశానండి ఇది. దీనికి పరిష్కారం ఎలా అని... ధన్యవాదాలు.. రాధిక గారు. స్పందనకు...
తాగి తందనాలాడినా పర్వాలేదు తమ జోలె నిండితే చాలనుకొనే దౌర్భాగ్యపు ప్రభుత్వం మనది,
రిప్లయితొలగించండివీధిలో ఆడవాళ్ళు నడుస్తుంటే అంగాంగాలను వర్నిస్తూ, పాటలూ, అమ్మ,ఆలి చుట్టూ అల్లుకున్న భూతుల ప్రేలాపనలూ..., రోడ్డు మీద చోద్యం చూస్తున్న చూపున్న దృతరాష్ట్రులూ... ,
బస్టాపుల్లో చొంగ కార్చుకుంటూ పనీ పాటాలేని వెదవలు ఆడపిల్లలని ఏడిపిస్తుంటే... తమకేమీ వినిపించటం లేదు అన్నట్లుండే తోటి ప్రయాణికులూ,
ప్రతి దానికీ ,పోలీసులే అక్కరలేదు అక్కడున్న అందరూ చెప్పుతో కొడితే వాళ్ళు తోక ముడుస్తారు.
సతీష్ గారూ, ఏమని చెప్పనూ, మీ అక్షరాలలో స్త్రీ రక్త కన్నీటి వేదన కనిపిస్తుంది.
ప్రతి పదానా, సామాజిక రుగ్మత కనిపిస్తుంది, మార్పును ఆశించే చైతన్యం కనిపిస్తుంది.
(జీతే రహో మేరీ భాయ్ )
మెరాజ్ గారు... ప్రభుత్వం ఎప్పుడైతే తమ విధులు మర్చిపోయిందో అప్పుడే దేశం బ్రష్టు పట్టిపోయింది. ద్వాపర యుగం చివర్లో ఇలాంటి ఘటనలే జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. ఇది కలియుగే ప్రధమ పాదే. కానీ ప్రధమ పాదంలోనే యుగాంత పైత్యాలు కనిపిస్తున్నాయి. కలి తన కరవాలాన్ని విదల్చక తప్పదేమో. కనీసం సభ్యత, సంస్కారాలు కూడా ఇంట్లో నేర్పలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అనిపిస్తోంది. ఎవరు ఎన్ని చెప్పినా ఫాతిమా గారు. సంస్కారం అనేది ఇంటి నుంచే మొదలు కావాలి. సమస్య ఇళ్లల్లోనే ఉంది. బహుశా పరిస్థితులు వేరు వేరు కావొచ్చు. అందరూ సంస్కారవంతులైతే సమస్యే లేదు. కానీ అది అత్యాశేేనేమో...
తొలగించండిబీభత్సం
రిప్లయితొలగించండిఅప్పుడప్పుడు తప్పట్లేదు.
తొలగించండికసాయి కళ్ళ మానవ మొసళ్ళు...
రిప్లయితొలగించండినాగరిక సమాజం అకృత్యపు ఆనవాళ్ళు...
అవునంది... అక్షర సత్యాలు. నాగరిక సమాజం ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నాం మనం.
తొలగించండిమనసులు, చేష్టలు అనాగరికమే. సాంకేతిక పరిజ్ఞానం మా సొంతమని విర్రవీగుతున్నాడు మనిషి. కానీ ఇంత వరకు మనసు నాడి కనుక్కోలేకపోయాడు.. అదే మనిషి. మనసెప్పుడూ మనిషిని వెక్కిరిస్తూనే ఉంది. దాన్ని కనుక్కుంటే సమాజానికి చికిత్స చేయడం చాలా సులువు.
కుక్కలు శవాన్ని పీక్కు తిన్నట్టు...
రిప్లయితొలగించండినరమాంస భక్షకుల్లా ఆమెపై రుధిర క్రీడ
ఓ కంట ఆమె కన్నీటి ధార. బాగారాశారు కసాయితనం పై మీ కసి
ఓ స్నేహితురాలు నేను ఓ రోజు డిస్కస్ చేసినప్పు తను ఇదే విషయంపై మాటాడుతూ కన్నీరు పెట్టుకుంది. ఆ క్షణంలో పాపం ఆడపిల్లలు ఫిజికల్ గా ఎంత టార్చర్ పడుంటారో అని. తన ఆవేదనే దీనికి ప్రేరణ. అవునండి చాలా కసి ఉంది... కసాయితనంపై.
తొలగించండిరాక్షసత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.. మీ స్పందనకు.
తొలగించండిReminds me of the Delhi 16nth December (nightmare to one and all) case! Many more still happen that don't come out in the open..Parents need to bring up their children with values and the rest is left up to them. Thanks for your effort in touching hearts:)
రిప్లయితొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు రాణిగారు.
తొలగించండి" అది అర్ధరాత్రి కాదు, అమావాస్యా కాదు
రిప్లయితొలగించండిసమాజం ఇంకా నిద్రపోనూ లేదు...
భద్రత లేని నడిరోడ్లు ఉన్మాదుల రహదార్లు
బలహీనుల ఆక్రందనలతో నిండిన శ్మశానాలు "
ఎంత బాగా రాసారు సతీష్ గారూ . జరుగుతున్న
వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపించారు . సమాజంలో
మనమూహిస్తున్న మంచి మార్పు ఎప్పుడో . ఇలాంటి మీ రచనలు అందరిలో కాకున్నా , కొందరిలో నైనా రవంత మార్పు తేగలిగితే ఎంత బావున్ను- మంచిని ఆశిస్తూ ఇంత మంచి కవితను అందించిన మీకు నా అభినందనలు -
శ్రీపాద
వాస్తవాలను గ్రహించే స్పృహలో లేదు సమాజం. మత్తులో తూలుతోంది, ఈర్ష్యఅసూయల్లో పడి చస్తోంది, రకరకాల ఇజాలతో కుళ్లుతోంది. అందువల్ల సమాజంలో ఈ ఆక్రందనలు ఆగడం కష్టసాధ్యమేనేమో అని భయం ఆవహిస్తోంది. మీ స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండి