Powered By Blogger

31 జనవరి, 2014

నా కలం కదులుతోంది...



కలం కదులుతోంది...
చురకత్తిల చురచురమని
సిరా ఉరకలై బిలబిలమని
స్వేచ్ఛా విహంగాలతో...
కదం తొక్కుతోంది...

నా కలం కదులుతోంది...
చీకటి తెరలను తరుముతు...
అజ్ఞానం అంతు చూస్తూ..
అగాధాన్ని పెకలిస్తూ...
గగనాన్ని నేలకు తెస్తూ...

ఈ కలం కదులుతోంది....
శిధిలమైన చచ్చు మెదళ్ల....
మొద్దు నిద్ర తట్టిలేపి...
అక్షర పునాది వేసి..
ఆలోచనల గోడ కట్టి....

నా కలం కదులుతోంది...
కన్నీటిని ఒడిసి పట్టి....
వ్యధా జీవనాన్ని తట్టి...
ఉన్మాదాన్ని చితక్కొట్టి...
అరాచకాన్ని తరిమికొట్టి....

ఈ కలం కదులుతోంది...
ఆశకు ఆయువు పోస్తూ...
కలలకు రూపం ఇస్తూ...
ధైర్యాన్ని నూరిపో్స్తూ...
నైరాశ్యాన్ని నమిలేస్తూ...

నా కలం కదులుతోంది...
ఆక్షర సేద్యానికి నాగలి పట్టి
నిరక్షరాస్యత కలుపు తీసి
నాగరికతకు నీరు పట్టి...
సంస్కారాల పంట పండించి....

ఈ కలం కదులుతూనే ఉంది
ఈ సిరా చిలుకుతూనే ఉంది...

నిబిడాంధకారాల అహంకారాన్ని
వెలుగుల కరతాళ ధ్వనులతో...
తరిమి.. తరిమి... కొట్టి...
నవయవ్వన ఉషోదయాల..
చైతన్య కిరణాలను పంచేవరకు...

నా కలం కదులుతూనే ఉంటుంది
ఈ సిరా చిలుకుతూనే ఉంటుంది


 


 

 



 
 

22 కామెంట్‌లు:

  1. కదిలే మీ కలం నుండి రాలిన ప్రతి భావమూ బాగుంది.
    అభినందనలు సతీష్ గారూ,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు ఫాతిమా గారు... నిన్న మీ కామెంట్ కూడా ఈ ప్రవాహానికి
      కొంత ప్రేరణ. నా కలం వాస్తవిక సమాజంలోనే పరుగులు తీస్తుందండి. ఇందులో సందేహం లేదు. కానీ.. నేను వ్యక్తిగతంగా ప్రాక్టికాలిటీనే నమ్ముతాను.

      తొలగించండి
  2. బావుంది సతీష్ గారు .. కలం కత్తి కన్నా పదునైనదని అనేవారు .. ఈరోజుల్లో అదెంత వరకూ నిజమో తెలియదు గాని .. మీ కలం నుండి జాలువారిన ప్రతీ అక్షరము కలాన్ని గౌరవించేవారి మెదళ్ళలో మెదలుతూనే ఉంటుంది ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కత్తి కన్నా కలం పదునైనదే... రాధిక గారు. కానీ... చదివే వాళ్లు తగ్గిపోతున్నారు. అందువల్లే
      సమాజం అంటే ఎంటో కూడా తెలియని యువత తయారవుతోంది. అందుకే ఈ అత్యాచారాలు, ఆత్మహత్యలు. వాళ్లని మార్చాలంటే కలాన్ని మించిన ఆయుధం లేదు. ధన్యవాదాలు... రాధిక గారు.

      తొలగించండి
  3. నవయవ్వన ఉషోదయాల..చైతన్య కిరణాలను పంచేవరకు...మీ కలం నిర్విరామంగా,అలుపన్నది ఎరుగకుండా,అహర్నిశలు మీకు అజేయంగా సహకరించాలని ఆశిస్తూ.......

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలా ప్రోత్సహిస్తే... నా కలం... నా కవన కదన రంగంలో కరవాలంలా కదం తొక్కదా చెప్పండి... తప్పనిసరిగా అక్షరయుద్ధం చేస్తూనే ఉంటాను. ధన్యవాదాలు శ్రీదేవి గారు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ఇది ఓ పత్రికలో వచ్చిన పేయింటింగ్. నిజానికి ముందు రాసేశాను. రాయడం ఓ అరగంటలో అయిపోయింది. దానికి ఏ చిత్రం పెడదామా అని ఓ గంట వెతకాల్సి వచ్చింది. చివరికి ఆంధ్రజ్యోతి ఎప్పటిదో ఆర్కైవ్స్ లో ఈ చిత్రం దొరికింది. బాగా సింక్ అయిందని అటాచ్ చేశాను.
      నా బ్లాగుకి ముందుగా మీకు స్వాగతం. నా భావనకు స్పందించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  5. s its really nice.. kalam kattikanna paduninadi, mee kavita inka padunugaa undandoy..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్యూ శృతి... ఇలాంటి కవితలకు స్పందిస్తే చాలు.. పైగా మీ ప్రశంస ఇంకా బాగుంది.

      తొలగించండి
  6. ఈ కలం కదులుతోంది...
    ఆశకు ఆయువు పోస్తూ...
    కలలకు రూపం ఇస్తూ...
    ధైర్యాన్ని నూరిపో్స్తూ...
    నైరాశ్యాన్ని నమిలేస్తూ...
    చాలా చాలా నచ్చేసింది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏదో నా వంతు అక్షర సేద్యం. మీకు చాలాచాలా నచ్చిందంటే... అంత కన్నా ఏం కావాలి.
      మరో సారి నా కలకరవాలాన్ని ఝళిపిస్తాను...

      తొలగించండి
  7. అక్షరాలతో నిద్దుర లేపే...
    ఆలోచనల గోడను కట్టే...
    అరాచకాన్ని తరిమికొట్టే...
    నైరాశ్యాన్ని నమిలేసే...
    ధైర్యాన్ని నూరిపోసే...
    ఆశా కిరణాలను ప్రసరించే...
    మీ కలం...

    కదులుతూ...
    కదిలిస్తూనే వుండాలని...

    విజయోస్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ లాంటి అనుభవజ్ఞులు ఆశీర్వాదం... కదనోత్సాహాన్ని ఇస్తుంది. థన్యవాదాలు రావు గారు.

      తొలగించండి
  8. మీ కలం ఎప్పుడూ ఇలా సరికొత్త భావాలతో కదులుతూనే వుండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పకుండా హిమ గారు. ఇంకా ఇంకా రాయలనే ఉంది నాక్కూడా.. ధన్యవాదాలు.

      తొలగించండి
  9. మీ కలం మంచి భావాలని పలుకుందండి

    రిప్లయితొలగించండి
  10. మీ కలం ఇలాగే కలకాలం కదలాలని కొరుకుంటున్నాను! :) Best wishes!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు శ్రీవల్లి గారు. నేను కూడా మీ కలం మళ్లీ కదలాలని ఆశిస్తున్నాను. మీ బ్లాగ్ చూశాను. చాలా సృజనాత్మకంగా కనిపించింది. మీ నుంచి మంచి కవితలు, భావనలు ఆశిస్తున్నాను.

      తొలగించండి
  11. " మీకాలం లోని 'సిరా' ఎప్పుడూ అడు గంటనీయకండి .
    మీ భావాలు ఎప్పుడూ ఇలాగే పరుగులు తీయనీయండి" .
    ఉత్తేజ పరుస్తూ ఉరకలేసిన మీ "నా కలం కదులుతోంది..." కవిత most powerful గా ఉందండోయ్ సతీష్ గారూ . భలే భలే .
    - శ్రీపాద

    రిప్లయితొలగించండి