Powered By Blogger

29 జనవరి, 2014

ఎవరి సినిమా వాళ్లదే...




ఆత్మస్థైర్యం ఒకరు చెప్తే వచ్చేది కాదు
ఓదార్పు కన్నీటిని ఆవిరి చేయ్యదు

చీకటిని తరమాలంటే వెలుగు కావాలని
నీకెవరూ చెప్పలేదు... అనుభవం అంతే... 

నీకు ధైర్యం ఇవ్వడానికి ఎవరూ ఉండరూ
లోపాలు వెక్కిరించేవాళ్లు చుట్టూ ఉంటారు
సమాజానికి పనికిరాని వాళ్లు... వాళ్లే
వాళ్లకు విలువిచ్చి నీ విలువ దిగజార్చుకోకు

అదేదో సినిమాలో చెప్పినట్టు... 
ఇక్కడ ఎవడి సినిమా ఆడిదే... 
ఎవడి సినిమాలో ఆడే హీరో... 
కర్త, కర్మ, క్రియ.. అన్నీ నువ్వే... 

మనుషుల్లో మానవత్వం కోసం వెతక్కు
కృతయుగం కాదిది.. హరిశ్చంద్రులు లేరు
త్రేతా, ద్వాపర యుగమూ కాదు... రాముళ్లు రారు
వలువలూడదీస్తే కాపాడే కృష్ణుళ్లు ప్రత్యక్షం కారు

ఇది కసాయి కలియుగం...
పాత రాతి యుగం మనస్తత్వాలే అన్నీ
రాతి గుహలు పాలరాతి గృహాలయ్యాయంతే
మనస్తత్వాలూ ఆనాటివే...  వేట, వేటు

నీ కోసం ఎవరూ రారు.. 
ఒక వేళ వస్తే వాళ్లే దేవుళ్లు... 
ఎవరో వచ్చి ఏదో చెయ్యరు
నీ సైన్యం నువ్వే... పోరాడు... 

గాంధీ ఈ రోజుల్లో ఉండి ఉంటే... 
శాంతి... శాంతి అనేవాడు కాదేమో
సుభాష్ చంద్రబోసులు కావాలిప్పుుడు
భగత్ సింగ్ ఉక్కు సంకల్పం కావాలి

ధైర్యం కోఠీలో దొరికే వస్తువు కాదు
ఎవడో నూరి పోస్తే వచ్చేదీ కాదు.. 
మనోబలం ఉంటే ధైర్యమే అదే వస్తుంది
నీ ధైర్యం నీలోనే ఉంది...  తీయ్ బయటికి

ఒక్క అడుగు నువ్వు వేస్తే... 
నీ అడుగులో ధైర్యం, సంకల్పం ఉంటే
వంద అడుగులు వెనకే వస్తాయి.. 
చట్టాలనే మారుస్తాయి... 
కసాయి కోరలు పీకి... సమాధి చేస్తాయి
( నా ముందరి పోస్ట్ లో కొన్ని రిప్లైలు పరిశీలిస్తే... సమస్య కన్నా పరిష్కార చర్చిస్తే బాగుంటుందన్న
స్పందనలొచ్చాయి. ఆ స్పందనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ... పరిష్కారం కావాలంటే.. 
ముందు మనం మారాలి. అందుకే ఈ పోస్ట్..  ఇందులో గాయం సినిమాలో సిరివెన్నెల గారి రాసి రెండు లైన్లను వాడుకున్నాను. శాస్త్రి గారు నన్ను క్షమించాలి. ( నిగ్గదీసి అడుగు పాటల్లో పాతరాతి గుహల నుంచిపాలరాతి గృహాల వరకు... మనిషి మారలేదు.. వేట అదే వేటు అదే అనే లైన్స్ ఉంటాయి... ఈ లైన్లు వాడుకున్నాను )

 


 



18 కామెంట్‌లు:

  1. ఎవరో వచ్చి ఏదో చెయ్యరు
    నీ సైన్యం నువ్వే... పోరాడు... Good inspiring lines

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కానీ ఒకటండి.. ఇలాంటివి చెప్పడానికి ఓకే గానీ.. ఆచరణ సాధ్యమైతేనే కొంతైనా చైతన్యం.
      ఆ ధైర్యం తెచ్చుకోవాలని. ఆడవాళ్లు మగాళ్ల మీద అన్నిటికీ ఆధారపడినంత కాలం... ఈ ధైర్యం అనేది మరుగున పడిపోయి... నిస్సహాయులుగా మారిపోతున్నారు. మహిళా పోరాటానికి సాయపడేందుకు ఎప్పుడూ మేం సిద్ధం. ధైర్యంగా వాళ్లు ముందుకు రావాలి గానీ... ధన్యవాదాలు పద్మగారు. కిందటి పోస్ట్ లో మీరు ప్రస్తావించిన అంశానికి స్పందించే ఈ లైన్స్ రాశాను.
      పరిస్థితి కొంచెం మారుతోంది.

      తొలగించండి
  2. ఎవరి సినిమా వాళ్ళే చుసుకోవాలనుకుటే ఇంక సినిమాలెందుకు అని చిన్న డౌట్ :-)
    పరిష్కార మారగం చూపించగలమే కాని నడిపించలేం కదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదే లిపిగారు నేను చెప్పేది. నీతులు చెప్పడానికి బాగుంటాయి. చెయ్యడానికే ప్రాక్టికాలిటీ
      ఉండాలి. అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. పిల్లి మెడలో గంటకట్టేవారెవరు.
      అందుకే ఎవరి సినిమా వారిదే. సమాజాన్ని నిందిస్తుంటాం. లాభం ఏంటి. మార్పు ఎలా మరి.
      అందుకే నీతులు చెప్పే వాళ్లను చూస్తే నాకు నవ్వొస్తుంది. ఇది రాసేటప్పుడు కూడా నన్ను చూసి నా అంతరాత్మ నవ్వింది. ఏదైనా చేసుకుంటూ వెళ్లిపోడమే.. అది మంచైతే చాలు.

      తొలగించండి
  3. motivational inspiration...

    your fire, within...
    is always erupting...


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది కూడా వేదనకు మరో రూపమే. మంచి చేద్దాం అని ముందుకెళ్తే ఒక్కరూ తోడు రారేం సర్.
      పైగా నీకెందుకు అని పనికిమాలిన డైలాగులు. అది చెడుని ప్రోత్సహించడమే కదా. అలాంటపుడు చెడిగిపోతోంది... సమాజం కుళ్లిపోయింది అని కిందమీద పడి గుండెలు బాదుకోడమెందుకు. అలాంటి వాళ్లకు సమాజం గురించి మాటాడే హక్కు లేదు. ఇదే నా భావన. ఒకరు మంచి కోసం ముందుకొస్తే... కనీసం మాట సాయమైనా చెయ్యాలన్నది. ఆ దైర్యమైనా తెచ్చుకోమనే ఈ బాధ. ధన్యవాదాలు సర్.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. అవును సర్. ఇక చల్లార్చుకోవాలి. దాదాపు నెల రోజులుగా ఇవే రాస్తున్నాను. ఇక నా లైన్లోకి వచ్చేయాలి. ట్రై చేస్తున్నాను గానీ.. ఎందుకో ఈ మధ్య ఇలాంటివే రాయాలని తెగ అనిపిస్తోంది. మీ ఫోన్ నంబర్ పోయింది మహా ప్రభో. పొరపాటున డిలీట్ అయింది. కాస్త ఫోన్ చేయండి ఒకసారి. మీ చాలా ముఖ్యమైన విషయాలు చర్చించేందుంది.

      తొలగించండి
  5. సతీష్ గారూ, మీ ప్రయత్నం,భావం మంచిది కాదేమో అని మీకనిపిస్తే... మీలో ఆత్మవిస్వాసం సన్నగిల్లింది అనుకొవాలి, లేదా ఇతరుల ప్రభావం మన మీద సవారీ చేస్తుందీ అనుకొవాలి.
    ఈ మద్య ఇలాంటివే రాయాలి అనిపిస్తుందీ అన్నారు.
    ఒకవిదంగా ఈ మద్య ఎక్కువగా ఆలోచించి ఉండవచ్చు కానీ మీలొ అంతర్లీనంగా సామాజిక రుగ్మతులపై, మార్పు దిశగా పయనించే శక్తి ఉంది.
    నేను ఏమీ చేయలేకపోతున్నానే అనుకోవద్దు, మానసిక గర్షణే మార్గం వెతుకుతుంది.
    ఇతరులు చెప్పిన మాటలు విమర్శలు అనుకోకూడదు, సలహాలే అంతే,
    సతీష్ గారూ, ఇలాంటి రాతలవల్లా.. ఉపయోగం ఏమిటీ, ఊరకే మనగుండె మండటమే తప్పా.. అనుకోవద్దు, అక్షరానికి విలువుంది, అది మార్పును తెస్తుంది,
    (ఇక్కడ నేను ఎవరినీ విమర్శించటం లేదు,)ఇలాంటి రాతలు మీకు తప్పనిపిస్తే....మనశ్శాంతిగా ఉండే ఎన్నో రచనలు చేసుకొవచ్చు,
    సెలవ్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు మరీ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. అసలు విమర్శలను పట్టించుకునే మనస్తత్వం కానేకాదు. ఈ మధ్య ఇలాంటివి రాయాలనిపిస్తోంది అని నేను పైన రాసిన కామెంట్ కి బహుశా స్పందించినట్టున్నారు. ఆ ఫణిగారు ప్రముఖ సాహితీ వేత్తల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను ఆయన ఆప్తమిత్రులం. కలిసి చాలా ఏళ్లు పనిచేశాం. రూం మేట్స్. నాకు పుస్తకాల్లో ఉన్న కిక్కుని పరిచయం చేసిన నా మలిగురువుగా నేను ఆయన్ను భావిస్తా. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తుల్లో ఆయనొకరు. నేను ఆయన అలాగే మాటాడుకుంటాం... సరదాగా. ఆ మాటలు పూర్తిగా మా వ్యక్తిగత సంభాషణ. మీరిలాంటి రచనలు ఎప్పటి నుంచి చేస్తున్నారో నాకు తెలీదు గానీ.. మేం గత పదేళ్లుగా ఇదే పనిలో ఉన్నాం. బ్లాగ్ ద్వారా కాదు.. నేరుగా సమాజం ద్వారా. రాతలతో సమాజంలో మార్పు వస్తుందనుకుంటే ఈ పాటికే రావాలి. ఇప్పుడు ప్రాక్టికల్ గా ముందుకెళ్లడం ముఖ్యం. అందరూ కబుర్లు చెప్పే వాళ్లే తప్ప... ముందుకు అడుగేసే వాళ్లు ఎంతమంది అనేది నా ప్రశ్న. మీది సద్విమర్శ. సద్విమర్శని ప్రశంసగా తీసుకునే అలవాటు కూడా నా ఆప్తమిత్రులు ఫణిగారి దగ్గరి నుంచే నేర్చుకున్నాను. కాబట్టి మీ ప్రశంసకు ధన్యవాదాలు. ఎప్పుడైనా భావాన్ని వ్యక్తీకరించడం వేరు.. అది ఎవరైనా చెయ్యగలరు. కానీ.. ఆ భావాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు... అని నా అభిప్రాయం. నేను ఇంప్లిమెంటేషన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అలానే మోటివేట్ చేస్తుంటాను. ధన్యవాదాలు.

      తొలగించండి
    2. రాతలవల్లా, చాలా మార్పు వచ్చింది, వస్తుంది, దానికి ఎన్నో దేశ చరిత్రలే కారణం.
      ఇకపోతే నేను ఫణిగారినుద్దేసించి రాయలేదు, ఇకపోతే నేను రాస్తున్నాను కనుక గొప్ప పని చేస్తున్నాను అని చెప్పటానికి నేనీ ప్రస్తావన తేలేదు,
      ఏది ఏమైనా సరైన అవగాహన( స్పందన) కల్పించలేదు నా వాఖ్య అని మాత్రం అర్దం అయింది.

      తొలగించండి
    3. అబ్బే అదేం లేదండి... మీరు చాలా సూటిగా చెప్పారు. మీ భావన నాకర్థమైంది. నేనే ఏమైనా నొప్పించానా అని... నా కలం వేరు, నేను వేరు ఫాతిమా గారు. సామాజిక ధృక్పధాన్ని నేను వేరే కోణంలో చూస్తాను. అందుకు కారణాలు అన్వేషిస్తూ వెళ్తాను.
      ఆ తోవలో నా కలం సహకారం నేను తీసుకోను. నా మనసు మాటే వింటాను.
      అందుకే నేనిలాటివి రాస్తుంటే నన్ను బాగా తెల్సిన కొందరు సరదాగా విమర్శలు చేస్తారు.
      అవి జోకులే. ఇది మీకు కన్వే చేయాలని ఇంకేదో రాసినట్టున్నాను.

      తొలగించండి
  6. మనోబలం ఉంటే ధైర్యమే అదే వస్తుంది
    నీ ధైర్యం నీలోనే ఉంది... తీయ్ బయటికి
    స్వామి వివేకానంద స్ఫూర్తిలా ఉన్నాయి ఈ లైన్లు.
    సతీష్ గారు స్ఫూర్తిదాయకంగా ఉంది మీ కవిత.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అసలు మనోబలమే ధైర్యమని నా ఉద్దేశం. ఇప్పుడదే లోపిస్తోంది శ్రీదేవి గారు. వివేకానందుడి సూక్తులు.. నేటి యువతకి ఆధునిక భగవద్గీత లాంటిది. ఆయన ఆధునిక కృష్ణుడే నా నమ్మకం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే... కచ్చితంగా నవ సమాజం సాధ్యం. వారి మాటల్లోని ప్రేరణ చాలా ఉంటుంది నా మీద.

      తొలగించండి