నా పేరు అతివ...
కొందరు మగువ అని...
చాలా మంది అబల అని కూడా అంటారు...
కానీ నేనొక భారతీయ స్త్రీని..
నన్ను పూజించిన చోట..
దేవతలు తిరుగుతుంటారని...
పురాణాల్లో ఉందట....
ఏమో నాకు తెలీదు...
ఆ దేవతలను ఎప్పుడూ చూడలేదు..
నేను పూజలూ అందుకోలేదు...
నా స్థానం కొన్నిళ్లలో వంటిల్లే...
మరికొన్నిళ్లల్లో కేవలం నేను
పక్క పంచి.. పిల్లల్ని కనే యంత్రాన్ని...
వాళ్లకేం తెలుసు స్వేచ్ఛ లేని చోట
సుఖం బదులు కంటతడే ఉంటుందని...
ఒక్కోసారి పుట్టగానే నేనుండేది...
ఆస్పత్రి బయట చెత్తకుప్పలో...
అందులో చీమలు, పురుగులకు
నేనే ఆహారం. నా తొలి పుట్టిన రోజు
బహుమతి మృత్యుకౌగిలి.
ఈ కథ వెనుక మరో పెద్ద వ్యధ
ప్రేమంటే నమ్మేస్తాను... అభిమానానికి కరిగిపోతాను
పక్కనే వంచన పొంచి ఉందని తెలుసుకోలేను
మూడు ముళ్లని ఆశపడ్డాను...
అన్ని ముళ్లేనని ఎలా ఊహించగలను...
కడుపులో పడిన దగ్గర నుంచి నాకు భయమే
ఎక్కడ చిదిమేస్తారో అని అదురే
పిండం నుంచే బతుకు గండం...
ఎవరికీ ఉండదేమో ఈ గ్రహణం
బలవంత భ్రూణహత్యా కాండ సమిధను...
మహలక్ష్మిని నేనంటారు...
మహమ్మారిలా ఎందుకు చూస్తారో...
కలికాలంలో ఆటబొమ్మను నేనే...
అర్థరాత్రి నడిరోడ్డున నిలబడటమా... హవ్వ
పట్టపగలే వివస్త్రను చేస్తుంటే..
నడిరోడ్డునే మీదపడి కోరిక తీర్చుకుంటే...
నిట్టనిలువున నలిపి విసిరేస్తుంటే...
శవపంచనామాలో ఎక్కడెక్కడో గాయాలు
చెప్పుకోేలేని చోట కసాయి గాట్లు
యత్ర నార్యంతు పూజ్యంతే....
వినడానికి ఎంత బాగుందో...
కట్నం తేకుంటే కిరోసిన్ తో అగ్నిహూత్రం
వలపు పేరిట ఆమ్లదాడుల రాక్షసకాండం
పెడరెక్కలు విరిచి మరీ కామాంధుల దుర్మార్గం
అడుగడుగునా శీల పరీక్షలే... అవమానాలే
అయినా నా ధైర్యం తరగనిది...
ఎందుకంటే....
నేనెప్పుడూ చావు అంచుల మీద బతుకుతుంటాను...
చావుతోనే న్నేహం చేస్తుంటాను... నాకెందుకు భయం.
నా ప్రయాణంలో ఎన్నో అంతులేని వ్యధలు
తడి ఆరని కన్నీళ్లు, చిక్కటి చిమ్మ చీకట్లు
అడుగడుక్కీ గుచ్చుకునే విషపు ముళ్లు
నా ఈ ప్రయాణంలో... ఓదార్పు ఏమైనా ఉంటే
అది... చిరుదీపంతో కాస్త దారిచూపిన మనసులు...
ముళ్లగాట్లకు రుధిరంతో తడిసిన చేదు జ్ఞాపకాలకు
కన్నీటి లేపనమేసిన మనుషులు....
(ఈ మధ్య కొందరి బ్లాగుల్లో మహిళల మీద జరుగుతున్న అరాచకాల గురించి చాలా మంది బాగా రాశారు. అమాయక ఆడపడుచుల మీద జరుగుతున్న హేయమైన అత్యాచారకాండకు నిరసనే ఇది)
చాలా బాగుంది
రిప్లయితొలగించండిహిమ గారు... మీ స్పందనకు ధన్యవాదాలు
తొలగించండిచాలా బాగా వ్రాశారు .. గొప్ప ఆలోచన ఉండాలి .. ఇలా వ్రాయాలంటే ;
రిప్లయితొలగించండిఓ స్త్రీ గా మీకు నా కృతజ్ఞతలు . స్త్రీ పరిస్థితి మారాలంటే ముందుగా పురుషుడే మారాలి . స్త్రీ లను పూజించిన చోట
దేవతలు తిరుగాడుతారని ఎవరు నమ్ముతారో లెదొ.. తెలీదు .. కాని స్త్రీ ని గౌరవం గా చూసిన మగవాడు మాత్రం
దేవుడే అవుతాడు .
స్త్రీ లేకపోతే మగాడి ఉనికే లేదు కదండి. ఆడతనం లేకపోతే మగతనం ఉండీ ఎందుకు.
తొలగించండికొంచెం సూటిగానే మాటాడతాను. ఏమనుకోకండి. రోజురోజుకి దిగజారిపోతున్న
మానవ విలువ వలువలూడిపోతున్నాయి. ఆడపిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు.
నాగరికత ఇదేనా అనిపిస్తోంది. మగాడు దేవుడు కాగలడో లేడో నాకు తెలీదు గానీ... పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న ప్రతీ స్త్రీ దేవతే. మంచి స్పందనకు ధన్యవాదాలు.
అతివల వ్యధను అతి దగ్గరగా రోజూ మీరు
రిప్లయితొలగించండిచూస్తున్నారు కనుకనే ఇంత బాగా స్పందించగలిగారు .
మనోవ్యధతో కూడిన మగువ మానసిక చిత్రవధను
వేదనతో మీరు వివరించిన తీరు వ్యధాపూరితమైన వాస్తవం
సతీష్ గారు ,రాధికగారి అభిప్రాయంతో నేను సంపూర్ణంగా
ఏకీభవిస్తున్నాను .
అవును శ్రీదేవి గారు.. నేను చాలా దురదృష్ణవంతుడిని. మీడియా వ్యక్తిని కావడం వల్ల రోజూ స్త్రీపై దమనకాండను మరీ దగ్గరగా చూడాల్సి వస్తోంది. ఈ మధ్యే ఓ ఆడపిల్లను కనేసి రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. చీమలు కుట్టి ఆ బంగారు తల్లి ఏడుస్తుంటే... ఎవరో మహానుభావుడు తీసుకెళ్లి అంగన్వాడీలో చేర్చాడు. లేకుంటే చనిపోయేది. అసలు పెంచడం చేతకానపుడు, ఆడపిల్లలే వద్దనుకునే మగాళ్లు పెళ్లిళ్లు చేసుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. కొన్ని సంఘటనలు చూసినపుడు గుండె తరిగిపోతోంది.
తొలగించండిchala baga rasaru. nenu edi enthabaga raste ammyemo anukunna kani mi name chusaka naku chala happy ga anipinchindi. e vyvasta lo marpu ravalante abbyile alochinchali ela.
రిప్లయితొలగించండిస్త్రీ గురించి స్త్రీ కన్నా పురుషులే బాగా స్పందిస్తారు అజ్ఞాత గారు. ఆడపిల్లలు కట్నం తేలేదని
తొలగించండికిరోసిన్ పోసే ఉన్మాద జాతిలో అత్తగారి పాత్రే ఎక్కువుంటుందన్న విషయం ఎక్కువ కేసుల్లో
కనిపిస్తోంది. మొగుడు ఆఫీసుకెళ్లిన తర్వాతే గృహహింస ఎక్కువుంటుంది. ఆడవాళ్ల గురించి
ఆడవాళ్లు ఆలోచించుకోలేని వేదనలో ఉన్నారు. వారి మెదళ్లలో ఎప్పుడూ సంఘర్షణలే. మీరన్నది నిజమే అబ్బాయిల్లో ఆలోచన పెరిగితే... అమాయక పడుచులు ఆక్రందనలకు కచ్చితంగా అడ్డుకట్ట వేయొచ్చు. నేను మరో విషయం మీకు చెప్పదలుచుకున్నాను... అబ్బాయిల్లో ఉన్నట్టే... అమ్మాయిల్లో కూడా మంచి, చెడు ఉన్నారు. నేను రాసింది మంచి అమ్మాయిల గురించి మాత్రమే. మంచి స్పందనకు ధన్యవాదాలు అజ్ఞాతగారు.
sorry late ga chudanu, aadapilla gurinchi kachitamina nijalni chepparu.. nijanga andaru meela alochiste aadapillalameeda agayityalu undavu, vallu kannillu karcharu.. chala baga rasaru..
రిప్లయితొలగించండిఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి శృతి. ఆడపిల్ల ఏడిస్తే... ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూలాల్లోకి వెళ్లి... ఎక్కడ తప్పుంది.. ఎలాంటి పరిష్కారాలున్నాయని వెదికి.. అమలు చేయాలి. ఇది జరిగేనా..
తొలగించండిమంచి స్పందన.. ధన్యవాదాలు.
సతీష్ గారూ, సర్వర్ ప్రాబ్లం వల్లా నా బ్లాగ్ లో కొంత ఇబ్బంది ఎదుర్కొని మీ పోస్ట్ ఆలస్యంగా చూశాను. కవిత చదివాను (అది కవిత కాదేమో గుండె వ్యద) ఏమనగలను, బాగుందీ అనటానికి అది వెన్నెల పాట కాదు, వేదనా మాట,
రిప్లయితొలగించండిమీ ఆలోచనా విదానం ఉన్నతమైనదీ, వివేకమైనదీ, మీరన్నట్లు మూలాల్లోకి వెళ్ళాలి, వ్యవస్థలో మార్పు రావాలి. ఆడ పిల్లల్లో పరిపక్వత కావాలి (దగా పడ్డ చెలెళ్ళలో అది లేదని కాదు నా ఉద్దేశ్యం) అన్నిటికన్నా ఉన్మాదులను, దుర్మార్గులనూ శిక్షించే శక్తి మన న్యాయ వ్యవస్థకి ఉండాలి.
ఏమి రాయాలో తెలీటం లేదు, ఈ అసమర్దతలో మనకూ బాగముందని మాత్రం ఒప్పుకుంటాను.
అవునండీ.. ఇది కవిత కాదు.. వ్యధే. ప్రతిరోజూ జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నిన్నమొన్నటి వరకు కమ్యూనిస్ట్ రాజ్యం. నిజానికి అక్కడే అభ్యుదయ భావాలు ఎక్కవగా
తొలగించండిఉండాలి. కానీ.. అక్కడే అత్యాచారాలెక్కువ. మహిళలపై అరాచాకాల్లో దేశంలోనే అధికం పశ్చిమ బెంగాల్లో. ఏం నేర్పారు అక్కడి ప్రజలకు మహామహులైన కమ్యూనిస్టులు.
ఈ మధ్యే ఓ గిరిజన యువతి ప్రేమించిందని.. దాన్నో పెద్ద నేరంగా చూపి... ఊరు మొత్తం అత్యాచారం చేయండని తీర్పిచ్చాయి కొన్ని పశువులు. ఆ అమ్మాయిని అడిగారు పోలీసులు
ఎంతమంది అత్యాచారం చేశారని... ఎంతమంది బలాత్కారం చేశారో లెక్క కూడా తెలియడం లేదని ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పింది. ఏంటండీ ఈ ఘోరం. గాయం సినిమాలో సిరివెన్నెల గారు ఓ పాటలో చెప్తారు. పాతరాతి గుహల నుంచి పాలరాతి గృహాలకు వచ్చినా.. వేట అదే వేటు అదే.. అనాగరికం అదే. ఏం మారలేదండి. సారీ.. కాస్త ఎమోషనల్ అయి ఇలా...
నాకు తెలిసి బ్లాగ్ లోకం లో స్త్రీలపై అరాచకాలు అంతగాలేవనుకుంటాను సతీష్ గారు.
రిప్లయితొలగించండిబ్లాగ్ లోకంలో లేవులెండి. ఇక్కడ పురుషాధిక్యత కన్నా స్త్రీ ఆధిక్యతే ఎక్కువండీ బాబూ...
తొలగించండిగట్టిగా మాటాడితే అక్షరాలతో తూట్లు పొడుస్తున్నారు, కనిపించకుండా కకావికలం చేస్తున్నారు. అమ్మో... అభ్యుదయభావాలున్న (అందరూ కాదు లెండి... చాలామంది) స్త్రీల లిస్టు కావాలంటే ఏదైనా బ్లాగ్ ఏగ్రిగేటర్లోకి వెళ్తే సరి. బ్లాగులోకం మహిళాధిక్య సమాజమే. ధన్యవాదాలు సృజన గారు.
స్త్రీలపై ఇలా అరాచకాలు జరుగుతున్నాయి అని రాయడంకన్నా వాటిని ఎదిరించి ఆత్మస్థైర్యంతో ఎలా సాగిపోవాలో అనే విషయాల గురించి చర్చిస్తే/వ్రాస్తే కొందరైనా ధైర్యంగా జీవిస్తారని నేను నమ్ముతాను సతీష్ గారు. మీరు రాసిన దాన్ని ఎత్తిచూపాలని కాదు కాని ఇలా అన్ని నిస్సత్తువ, నిర్వీర్య ఘటనలు స్త్రీలవే అని రాస్తే ఇంక గుండే నిబ్బరం ఎక్కడ నుండి వస్తుంది స్త్రీపురోగాభివృద్ది ఏముంటుంది అని నా భావం. మన్నించాలి.
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్టే. కానీ... సత్తువ ఎక్కడి నుంచి రావాలి అనేదే ప్రశ్న. మీ కామెంట్ నే తీసుకుందాం. సూటిగా మీరు చెప్పాల్సిదంతా చెప్పారు... అది ధైర్యం. ఐ ఆల్వేస్ వెల్కమ్ దట్. మరి.. ఆ చివర మన్నించాలి ఎందుకు...? వాడు మగాడు ఏదైనా అనుకుంటాడేమో... అనా. అదే నిస్సత్తువ. అక్కడే పురుషాధిక్యతకి అవకాశం దొరికింది. సమాజంలో చాలా మంది ధైర్యం ఉన్న ఆడపిల్లలూ ఉన్నారు. మానసికంగా మన స్త్రీలకు ఇళ్లల్లో నూరిపోసే మొహమాటాలు, భయాలు, వయసుకి తగ్గట్టుగా లేని పెంపకాలు, వాడు మగాడే నువ్వు ఆడపిల్లవి అని చెప్పే పనికిమాలిన సంగతులు... ఇవన్నీ జీవితాంతం పాతుకుపోతున్నాయి. తనకు తెలియకుండానే నేను తక్కువేమో అనే భావనని
తొలగించండికల్పించే అదే నీ బతుకు అని నిర్ధారిస్తున్నాయి. అక్కడి నుంచి మార్పు రావాలి పద్మగారు.
నాకు రావాల్సిన స్పందన ఇప్పుడొచ్చింది. ధన్యవాదాలు పద్మగారు.
థ్యాంక్యూ....నేను మన్నించాలి అన్నది మీ భావాలతో ఏకీభవించ లేకపోయాను అని చెప్పి, అంతే కానీ నిస్సత్తువతోనో, పురుషాధిక్యత అన్న భయంతోనో కాదు. అయినా వాటికి ఇక్కడ తావులేదుగా....మీ ప్లేస్ లో స్త్రీ రాసినా నేను ఇదే రాసేదాన్ని.
రిప్లయితొలగించండిపద్మ గారు మీ భావం అర్థమైంది . మీ రన్నది కూడా అంగీకరిస్తున్నాను. నిజమే పరిష్కారాల చర్చ కూడా జరగాలి. వాటి గురించి చర్చించే ప్రయత్నం చేస్తాను. మీ స్పందనలో నిక్కచ్చితనం నచ్చింది. ధన్యవాదాలు
తొలగించండిమిక్కిలి బాధాకరమైన విషయం ఏమిటంటే...
రిప్లయితొలగించండిఅబలలపై జరుగుతున్న దారుణాలకు
కొన్ని సందర్భాలలో జనాగ్రహం తీవ్రంగా
ఉంటున్నప్పటికీ కూడా స్పందించాల్సిన
జవాబుదారీ వ్యవస్థలు
కేవలం మొక్కుబడిగా -
మానవీయ కోణాలను చిన్నచూపు
చూస్తూ స్పందించడం...
బాధితులకు వారి కుటుంబాలకు
ఏ మాత్రం స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయకుండా...
తిరిగి వాళ్ళనే నేరస్తులలాగా చూస్తూ
నిర్దాక్షిణ్యంగా మానసిక క్షోభకు గురిచేయడం...
ప్రతిదానికీ రాజకీయ లాభాల బేరీజులు...
ఓట్ల లెక్కలు...
చాల చోట్ల నిందితుల వెనుకే రాజకీయ పార్టీలు...
ఇక నిందితులకు భయమెందుకుంటుంది...
వాళ్ళను కాపాడటానికి ఇన్ని వ్యవస్తలున్నప్పుడు...
మమతా బెనర్జీ గారి మహిళా సామ్రాజ్యంలోనే...
మహిళలు...
కాదు...
మొత్తం మనుషులే
తలదించుకోవాల్సిన దుర్గతి వున్నపుడు...
ఎక్కడ ఇలాంటి సమస్యలకి పరిష్కారం?
నిర్భయ ఉదంతం తర్వాత
తగ్గుముఖం పట్టవలసిన ఇలాంటి సంఘటనలు
రోజు రోజుకి పెరుగుతూండటం చూస్తుంటే...
ముందు రోజుల్లో సమాజానికి పట్టబోయే దుర్గతి
ఇప్పుడే కళ్ళకు కడుతోంది...
నిజమే సర్... శిక్షించాల్సిన వ్యవస్థలు, చట్టాలు... నేరస్తులను కాపాడే విధంగానే ఉన్నాయి.
తొలగించండిఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి నేరశిక్షాస్మృతిని పట్టుకుని వేలాడుతున్నాం. క్రిమినల్ ప్రొసీజర్
కోడ్ సక్రమంగా అమలే కావడం లేదు. ఇదేమిటి ఏసిడ్ దాడులు చేసిన కేసుల్లో జీవితం మొత్తం కోల్పోయారు చాలా మంది అమ్మాయిలు. కాని దాడి చేసినవారెవ్వరు ఇప్పుడు
జైళ్లలే లేరంటే నమ్ముతారా. 1990ల్లో కేరళో 11 మంది సూర్యనెల్లి అనే మహిళను చెరిచారు.
భారతదేశంలోనే సుప్రసిద్ధమైన సూర్యనెల్లి కేసులో... ఆ పదకొండు మందీ బయటే ఉన్నారు.
ఇలా ఒకటి కాదు.. నేరం చేసిన వాడికి కఠినంగా శిక్షలు పడితేనే వ్యవస్థలో కొంతవరకు మార్పు సాధ్యమవుతుంది. ఇందుకు నేతలు కుహనా వాదాలు కట్టిపెట్టాల్సి ఉంది.
చాలా ఆర్ద్రంగా రాశారు, సతీష్. ఒక వ్యవస్థ పురోగతిని అంచనా కట్టాలంటే, ఆ వ్యవస్థలో స్త్రీలకు లభించే గౌరవాభిమానాల్ని చూస్తే సరిపోతుందంటాడు ఓ ఫిలాసఫర్. ఆ రకంగా చూస్తే, ప్రస్తుత వ్యవస్థ ఎంతటి అథోగతికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం అందిరకీ తెలిసిందే. ఒకటి... స్త్రీలపై అత్యాచారాలకు కారణమవుతున్న నేపథ్యాన్ని... అంటే, యువతను పెడదారి పట్టిస్తున్న అంతులేని అసభ్యత, అశ్లీలత, హింస, డ్రగ్స్, లిక్కర్ లాంటివాటిని పూర్తిగా నిషేధించడం. రెండోది... అత్యాచారాలకు పాల్పడే కిరాతకుల్ని వెంటనే కఠినంగా శిక్షించడం. ఈ రెండూ కూడా ప్రభుత్వ బాధ్యతలే. కానీ, ఈ విషయంలో ప్రభుత్వాలు మాత్రం అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాల్ని నిగ్గదీసి, పనిచేయించే స్పృహ, చైతన్యం మెజారిటీ ప్రజల్లో వచ్చినప్పుడే ఈ అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందనిపిస్తుంది. ఆ దిశగా సొసైటీ అడుగేస్తుందని ఆశిద్దాం!
రిప్లయితొలగించండిఅవును నాగరాజ్ గారు. చట్టాల్లో మార్పుల గురించి ప్రభుత్వాలు ఎందుకు సీరియస్ గా
తొలగించండిఆలోచించడం లేదో అర్ధం కావడం లేదు. లోపం ఎక్కడుందో గుర్తించడంలోనూ
విఫలమవుతూనే ఉన్నాయి. సినిమాల్లో, ఇంటర్ నెట్ లోనూ అసభ్యత అశ్లీలతనూ నిరోధించలేకపోతున్నారు. ఇంక మందు మీద వచ్చే ఆదాయంతో బతికేస్తోంది
మన ప్రభుత్వం. యువతను ఎందుకూ పనికిరానివారిలా తయారు చేస్తున్నారు. ఆడవాళ్లలో తప్పులు లేవని కాదు. వాళ్లలోనూ ఉన్నాయి. కానీ... స్త్రీ సమాజానికి
నేరుగా జరుగుతున్న నష్టం తో పోలిస్తే... పురుష సమాజం నష్టం లెక్కలోకి రానిది.
అందుకే ఈ ఆవేదన.
ఇది స్త్రీ సమాజాని