భారతం పూర్తి చేశాక. మరికొంత లోతుగా అధ్యయనం చేశాను.
చదువుతున్న కొద్దీ చదవాలనిపించే అద్భుతమది. ముఖ్యంగా
యుద్ధానంతర ఘటనలు భయోత్పాతాన్ని కల్పించాయి. ఒక
యుద్ధం తర్వాత దేశం పరిస్థితులు ఎంత కల్లోలమో.. ఆనాడే వ్యాసుడు
కళ్లకు కట్టినట్టు రాసినా... ఇప్పటి నాయకులు చిచ్చు పెట్టుకోడం
బాధాకరం. 31 ఏళ్ల ఈ వయసులో నేను భారతం పూర్తి చేయడం
చాలా ఆనందం కల్గించింది. అయితే.. అనువాదం మాత్రమే చదివాను.
వ్యాస సంహితలో ప్రతీ పద్యం క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంటున్నాను. గతంలో
లక్క ఇంటి కథ రాసాను. లక్క ఇంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాక
అడవుల్లో భీముడికి, హిడింబాసురుడికి యుద్ధం జరుగుతుంది
ఆ ఘోర యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు. ఆ అసురుడి
చెల్లెలు హిడింబి భీముడిపై మనసు పడుతుంది. కుంతీ ఆమోదం
మేర ఆమెను వరిస్తాడు. అనంతరం ఏక చక్రపురంలో తల దాచుకుంటారంతా.
అక్కడ ఊరిని మింగేస్తున్న బకాసురుని చంపి... అందరి మన్ననలు
పొందుతారు. ఇదంతా అజ్ఞాతంలో బ్రాహ్మణ వేషధారులుగా పాండవులు
గడిపిన జీవితకాలంలో ఇవన్నీ జరిగాయి. అప్పుడే ద్రుపదుడు తన కుమార్తె
అగ్నిసంజాత.. కృష్ణకి.. అదే అందరికీ తెలిసిన నామధేయం ద్రౌపదికి
స్వయం వరం ప్రకటిస్తాడు. ఇందుకో కారణముంది. ద్రుపదుడు లోగడ ద్రోణుడి చేతుల్లో
పరాభవం పొందుతాడు. ద్రోణుడిని సంహరించాలంటే అది అర్జునుడి వల్లే సాధ్యం.
అందుకే తన అల్లుడిగా అర్జునుడిని పొందాలని.. స్వయం వరం పెడితే అజ్ఞాతంలో
ఉన్న అతను వస్తాడని ఆశిస్తాడు. స్వయంవరం విషయం తెలుసుకున్న పాండవులు
స్వయంవరానికి వెళ్తారు. నల్లని మేని ఛాయలో అత్యంత సౌందర్యవతి
అయిన ద్రౌపది వరమాలతో నిలబడి ఉండగా... దేశ విదేశాల రారాజులు
సుయోధన, కర్ణ సమేతంగా వస్తారు. ద్రుపదుడు చిత్రవిత్రమై మత్స్య యంత్రాన్ని ఛేదించిన వారికే ద్రౌపది
అని ప్రకటిస్తాడు. మొదట కర్ణుడు ధనుర్భాణాలతో సిద్ధమవుతాడు.
కానీ ద్రౌపది అంగీకరించదు. శూతపుత్రుడైన కర్ణుడు తగనివాడని వారిస్తుంది. అవమానం చెందిన కర్ణుడు..
ఆ మాటను అలానే
మనసులో పెట్టుకుంటాడు. ఇదో కీలకమైన ఘట్టం మహాభారతంలో.
అప్పుడే శ్రీకృష్ణుడు సాత్యకి స్వయంవర పర్యవేక్షణకు వస్తారు. అదే
సమయంలో ఆయన పాండవులనూ గుర్తుపడతాడు. యుక్తవయసులో
పాండవ శ్రీకృష్ణుల కలయిక తొలిఘట్టం మత్స్యయంత్ర ఛేదనమప్పుడే.
రాజులంతా ఆ మత్స్యయంత్రానికి తలలు వచి వెనక్కు తగ్గగా.
నారాయణుడి ఆజ్ఞమేరకు.. ఆయన అంశ నరుడూ.. కారణ జన్ముడూ
అయిన అర్జునుడు.. విల్లంబులు ధరించి.. మత్స్యయంత్రం దిశగా
వెళ్తాడు. శూతపుత్రుడు అనర్హుడని చెప్పిన క్షత్రియ కన్య ద్రౌపది
మరి బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుని కూడా తిరస్కరించాలి కాదా.
కాని అలా చేయలేదు. దానికో కారణముంది. అప్పటి వర్ణాశ్రమం ప్రకారం
బ్రాహ్మణులు క్షత్రియ, వైశ్య కన్యలనూ వివాహమాడొచ్చు. క్షత్రియులు
వైశ్యులనూ వివాహమాడొచ్చు. పై పద్ధతి ప్రకారం... ద్రౌపది... ఆ బ్రాహ్మణ
కుమారుడు మత్స్య యంత్రం వైపు వస్తున్నా... తలదించుకునే నిలబడింది.
మిగిలిన బ్రాహ్మలు మారువేషంలో ఉన్న అర్జునిడిని ఎగతాళి చేస్తున్నా
శ్రీకృష్ణుడికి నమస్కరించి.. మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. నారాయణుడి
తేజస్సులో సగభాగం అర్జునుడికి సంక్రమించిందీ ఇక్కడి నుంచే.
అర్జునుడిపై నారాయణుడి ప్రభావం మహాభారత యుద్ధం చివరివరకు
కొనసాగింది. ఆ తర్వాత లేదు. అలా మత్స్య యంత్రాన్ని ఛేదించి
ద్రౌపదిని ఇంటికి తీసుకొచ్చే వరకు తన అల్లుడు అర్జునుడే అని
ద్రుపదుడికి తెలీదు. అ తర్వాత పాంచాలి పంచభతృక ఎలా అయిందో
తర్వాత తెలుసుకుందాం. అందరూ అనుకున్నట్టు పాంచాలి మనస్పూర్తిగా
ఐదుగురినీ అంగీకరించిందా.. ఆ సమయంలో ద్రౌవది మానసిక స్థితి
ఎలా ఉందో.. వ్యాసుడు చాల చక్కగా రాశారు. ద్రౌపది మీద రకరకాల
పుస్తకాలొచ్చాయి. అవి కూడా చదివాను. కానీ... మహాభారతంలో
వ్యాసుడు చెప్పిన వివరణకు వక్రభాష్యాలు తీసారనే స్పష్టమైంది.
ద్రౌపది అత్యన్నతమైన వ్యక్తిత్వం గల ఆధునిక మహిళకు ఏమాత్రం
తీసిపోదు. ఆ వివరాలు మరో సారి చర్చిద్దాం. ధన్యవాదాలు.

[..]31 ఏళ్ల ఈ వయసులో[..]
రిప్లయితొలగించండిPlease mention the publication&Author of translated book you read.
Is it available online to purchase?
http://www.telugubhakti.com/telugupages/monthly/mahabharat/mahabharat.htm
తొలగించండిఈ లింక్... క్లిక్ చేస్తే.. మీరు డైరెక్ట్ గా మహాభారతం డౌన్ లోడ్
చేసుకోవచ్చు. కానీ.. ఇది కవిత్రయ ఆంధ్ర మహాభారతానికి
అనువాదం. విపులంగా కావాలంటే టీటీడీ వారు ప్రచురించిన
మహాభారతం టీటీడీ కళ్యాణ మంటపాల్లో దొరుకుతోంది.
http://www.telugubhakti.com/telugupages/monthly/mahabharat/mahabharat.htm
రిప్లయితొలగించండిఈ లింక్... క్లిక్ చేస్తే.. మీరు డైరెక్ట్ గా మహాభారతం డౌన్ లోడ్
చేసుకోవచ్చు. కానీ.. ఇది కవిత్రయ ఆంధ్ర మహాభారతానికి
అనువాదం. విపులంగా కావాలంటే టీటీడీ వారు ప్రచురించిన
మహాభారతం టీటీడీ కళ్యాణ మంటపాల్లో దొరుకుతోంది.
మూల శ్లోకం తెనుగు లిపిలోనూ, అర్ధం తెనుగులోనూ ఉన్న భారత, భాగవత అనువాదాలు దొరుకుతున్నాయా. ఎవరేనా పబ్లిష్ చేసేరా?
రిప్లయితొలగించండిఉన్నయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేశారు.
తొలగించండికాకపోతే అవి ఆంధ్ర భారతం. వ్యాస భారతం దొరకడం కాస్త
కష్టంగానే ఉంది. అయినా సోర్సెస్ ఉన్నాయి. భాగవతం
పుస్తకం మా ఇంట్లోనే ఉంది. అడ్రస్ మీకు నేను రేపు
మెసేజ్ పెడతాను. థాంక్యూ.
ఉన్నయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేశారు.
రిప్లయితొలగించండికాకపోతే అవి ఆంధ్ర భారతం. వ్యాస భారతం దొరకడం కాస్త
కష్టంగానే ఉంది. అయినా సోర్సెస్ ఉన్నాయి. భాగవతం
పుస్తకం మా ఇంట్లోనే ఉంది. అడ్రస్ మీకు నేను రేపు
మెసేజ్ పెడతాను. థాంక్యూ.
సతీష్ గారు,
రిప్లయితొలగించండిఅడ్రస్ చెబుతానన్నారు, మరచినట్లుంది.
లేదండీ.. అకస్మాత్తుగా మా ఊరు విజయనగరం వెళ్లాల్సి
తొలగించండివచ్చింది. ఇవాళే వచ్చా. రేపు తప్పకుండా... తెలియచేస్తాను.