మన్మధుని కొంప ఒక చెంప కనిపింప చీరగట్టి నడియెన్ చిగురుబోడి...
శ్రీనాధుడికున్నంత రసజ్ఞత చాలా మంది మహారచయితల్లోనూ ఉంది
కానీ.. చదివినంతనే మనసుని వేడెక్కించే మధురానూభూతి మాత్రం
శ్రీనాధుడికే సొంతం (ఇది పూర్తిగా నా అభిప్రాయం).
అసలు విషయానికొస్తాను. నా గోలేంటంటే.. చీర స్పర్శ లేక... చిగురుబోడిల
తనువు విరహిస్తోంది. చీర కూడా విలపిస్తోంది. పైన నేను రాసిన శ్రీనాధుని
కావ్యతునక అర్థాన్ని విడమరచి చెప్పడం భావ్యం కాదు. అది తెలుసుకుంటేనే
కిక్కు. చీరందం ఎంత చెప్పినా తక్కువే. చిరచిరలాడే ఆ చీర.. చీర కాదు. గగన జఘనాల పడచు
నయాగారాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఒడిసి పట్టి
అన్నీ కలగలిపి ఓ చోట కుదిర్చే... శృంగార తెర. ఆ తెర తెరలుతెరలుగా
ఎగిరిపడుతుంటే అందం, కాస్త జారితే... పడుచుదనం,
కుదురుగా కుదిరితే.. అసలుసిసలైన స్త్రీత్వం.
ఏమని వర్ణించను... వదులుగా వదిలిన కురులసిరులు పిల్ల తుమ్మెర తాకి
వయ్యారి గోదారిలా అలలుగా దూకుతుంటే..ఆ కురులతో పమిత పోటీపడితే.
నులివెచ్చని శీతల సాయంత్రాన మల్లెపూల మత్తుల్లో... చిత్తుగా ఓడి..
చీర గట్టిన చెలిచెంత ఉండటం కన్నా గొప్ప అనుభవం... ఇంకేముంది.
ఏదీ ఆ చీరందం.. ఎక్కడుంది.. రసమయ హృదయాలను తట్టిలేపే
మకరంద వీచిక. జిలుగుపైట... అహో.. అదృశ్యమవుతున్నదే
రెండు మూరల మిడ్డీలు... ఒక మూర పైవస్త్రాలతో... అసలు మనసే కదలని
మధ్యమ సంసృతిలో చీర విరహాగ్నితో రగిలిపోతున్నదే. మన్మధుని కొంప
చేరలేక... ఒక చెంప విరహవిషాధకన్నీటి చుక్క రాల్చి... ఇనుపకారాగారం(బీరువా)లో బందీగా మిగిలిపోతున్నదే చిగురుబోడి...
మధుమాసంలో పిల్ల తెమ్మెరలా ఉంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలు...
తొలగించండిఅంతగా ఇనుపకారాగారంలో బంధించిన వాటి వెలపెరిగినా వెర్రిగా కొనెడి ముదితలెందరో ఉండగా చీర విరహాగ్నితో రగలనేలనో??:-)
రిప్లయితొలగించండిఇనుప కారాగారములో బంధించుటకే
రిప్లయితొలగించండివెర్రిగా కొనెదరు మగువలు...
కుచ్చులు దొపెడి దోసెడలెచ్చట
కనిపించకనే... విరహమూ, విరహాగ్ని