విజయనగరవాసిని కాబట్టి గురజాడంటే మక్కువ
ఆ మక్కువ తక్కువైనా నా ఊరు అలిగి ఊరుకుంటుంది
అందుకే నా తొలిపలుకులు... మా గురజాడ ఇంటి నుంచి
మొదలుపెడదామని ఇలా... నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో
మా లెక్కల ట్యూషన్ గురజాడ వారి ఇంటికి సరిగ్గా నిమిషం నడక.
మేం అరగంట ముందు నుంచే అక్కడ తచ్చాడేవారం.
ఆ మహానుభావుడి ఇంటి అరుగుపైనే కూర్చుని పిచ్చాపాటి మాటలు
ఆ అరుగు స్పర్శే నాలో సాహిత్యంపై ప్రేమ పెంచిందేమో.
గురజాడ ఇల్లు మీ ఇంటికి దగ్గారా.. అని హైదరాబాద్ లో అందరూ వింతగా
అడిగేవారు. అప్పుడు చాలా గర్వంగా అనిపించేది. సాహిత్యనిధి,
అక్షరాగారం మా ఊరు గుర్తొచ్చేది.
అదో సాహిత్య సమరాంగణం. అక్షర ప్రాంగణం. అందుకే నా తొలి బ్లాగులో
మా సాహిత్యపు పెద్ద దిక్కు... గురజాడ వారి అడుగు జాడల నీడలతో మొదలు
పెడుతున్నా. ధన్యవాదాలు.
అదృష్టవంతులు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅదృష్టవంతులు!
రిప్లయితొలగించండిఈ విషయం తెలియగానే మనసున కదిలిన భావన ఇది.
ధన్యవాదాలు...అప్పుడప్పుడు స్పందన
రిప్లయితొలగించండిమరెంతో ఉత్సాహాన్నిస్తుంది. మీ స్పందన
నాకు స్వాతిచినుకులాంటింది..