భారతీయ ఆధ్యాత్మిక చింతనలో ప్రతీ విషయం వెనుక ఒక లాజిక్ ఉంటుంది. ఈ శ్లోకాలు కూడా అలాంటివే. శ్లోకం అంటే ఛందోబద్ధమైన కొన్ని పదాలు, అక్షరాల ఈక్వేషన్. ఆరోగ్యానికి బూస్ట్, హార్లిక్స్ అని పిల్లలకు పొద్దున్నేఇస్తాం. అలాగే మానసిక చైతన్యానికి శ్లోకాలు బూస్టర్లు. అందుకే చాలా ఈజీగా ఎవ్వరైనా పాడగలికే స్వరాలతో ఈ శ్లోకాలను రూపొందించాం. ప్రతీ శ్లోకానికి తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్ అందించాం. ప్రతీ రోజూ ఈ శ్లోకాలు వింటే చాలు, ఓ నెల రోజుల్లో పిల్లలే పాడేస్తారు. ఈ రోజుల్లో వేదికల మీద మాట్లాడే వారే హీరోలు. కాన్ఫిడెన్స్, భాష మీద పట్టు ఉంటే తప్ప వేదిక మీద ఆకట్టుకునేలా మాట్లాడడం సాధ్యం కాదు. అలాంటి కాన్ఫిడెన్స్, కష్టమైన పదాలను కూడా స్పష్టంగా పలికే శక్తిని శ్లోకాలు ఇస్తాయి. రోజూ ఓ పదినిమిషాలు చాలు వీటి ప్రాక్టీస్‌కి. పెద్దలు కూడా రోజు ఓ పావుగంట, మీ పనులు చేసుకుంటూ వీటిని వింటే బోలెడంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఎలాగూ రోజంతా బిజీలు, ఒత్తిళ్లే కదా. వాటిని భరించాలంటే ప్రశాంతత చాలా అవసరం. ఆ ఒత్తిళ్లకు మంచి మందు... ఈ స్వరసహిత శ్లోకాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి