Powered By Blogger

18 జనవరి, 2014

హిమజ్వాలాంతరాళలో....





                      ఓ అలసిన మనసు
                      సేద తీర్చేందుకు..

                      వెన్నెల పరుపు వేశా...

బరువెక్కిన హృదయమో...
అలోచనల బందీనో...
చెంపజారిన కంటతడో....
ఆనంద నందనవనమో...
                      ఏమో... తెలీదు... ఎవరో
                      అయినా... వేశాను వెన్నెల పరువు...
                      అలసిన మనసని అనిపించి...

బహుదూరపు బాటసారి అని...
కనులకు చిక్కని నిశీధి అని...
కలలకు అందని ఊహాఝరి అని...
మౌనాన్ని ప్రేమించే శూన్యమని...
                      అనుకుంటూ ఉంటాను... కానీ...
                      మనసు చెప్తుంటుంది... అస్పష్టంగా
                      అది.. అలిసిన మనసే అని...

మంచుతెరల్లో హిమబిందువులా...
నడిసముద్రంలో నిశ్శబ్దంలా...
జడివానలో ఓ వానచినుకులా...
హోరుగాలిలో ఓ మరీచికలా..
                       వెతికినా కనిపించదు... కానీ..
                       మనసు వెతుకుతూనే ఉంది
                       ఆ మనసు లోతు ఎంతని....

జవాబు లేని ప్రశ్న అని...
జాబు చేరలేని చిరునామా అని...
తీరం చేరని కెరటమని...
అంతూదరీ లేని దూరమని...
                      మది రొద పెడూతునే ఉంటుంది
                      కానీ... నా మొండి మనసు వినదు
                      అన్వేషిస్తూనే ఉంటుంది.... 

ఆలోచనల తెరలు దొంతరలైనా...
ఆ మనసుది అంతులేని కథే అయినా....
ఆ హిమజ్వాలాంతరాళ వెనుక ఉన్నది
హిమమో, జ్వాలో... వెతుకుతూనే ఉంటుంది... నా మది
                     ఈ భావాతీతఘర్షణలో... నే గెలిచినా ఓడినా...
                     అలిసిన మనసది... అందుకే
                     సేద తీరు అని... వెన్నెల పరుపు వేశా...

 



 

  
 

 

 

15 కామెంట్‌లు:

  1. ఏది ఏమైనా అలసిన మనసు సేద తీరడానికి వెన్నెల పరుపు వేయడం చాలా బాగుంది సతీష్ గారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు శ్రీదేవి గారు... ఎందుకో మనసులోంచి అలా వచ్చేసింది.. ఇది కవితో.. ఇంకేదో నాకే తెలీదు. థాంక్యూ...

      తొలగించండి
  2. "హిమజ్వా"లా లంతరాళలో...చాలా బాగుంది సతీష్ గారు

    రిప్లయితొలగించండి
  3. ఇలా ఒక దాన్ని మించి ఇంకోటి
    వెంట వెంటనే వ్రాస్తూ...

    ఎలా కామెంట్ చెయ్యాలి అని పదాలకు
    తడుముకునేట్లు చేస్తూ...

    simply సూపర్బ్...
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రశంస చూస్తే ఇంకా మంచి పోస్ట్ రాయాలనుంది. రాస్తాను. ధన్యవాదాలు నాగమల్లేశ్వర రావు గారు.

      తొలగించండి
  4. రిప్లయిలు
    1. ధన్యావాదాలు, ధన్యవాదాలు... మా అమ్మగారు ఆవకాయ పెట్టారంటే... నేను ఆ ఆవకాయతో
      మాత్రమే తింటా... నాకు మహా ఇష్టం. మీ బ్లాగ్ చూశా... నోరూరుతోందండి. థాంక్యూ...

      తొలగించండి
  5. మీ అక్షరాలలో జ్వాలా.. మీ ఆశయాలలో హిమమూ ఉన్నాయి,
    కలసి ఆశయంగా మారుతున్నాయి. అభినందనలు మంచి కవిత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెరాజ్ గారు... నా మనసులో సాగిస్తున్న ఓ అన్వేషణకి ఇది పదరూపం. మీ ప్రశంసకి
      ధన్యవాదాలు. వడ్డెర చండీదాస్ గారు రాసిన హిమజ్వాల నా ఫేవరేట్లలో ఒకటి. ఈ
      భావనకు ఆ పేరు కాపికొట్టాల్సి వచ్చింది. అంత గొప్ప టైటిల్ ని పెట్టొచ్చో పెట్టకూడదో
      తెలీదు గానీ... నా ఈ మనోభావానికి అదైతేనే సరిపోతుందని.. హిమజ్వాల అనే
      పేరు పెట్టే ధైర్యం చేసేశాను.

      తొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. అలసిన మనసు సేదతీరేవేళ....
    హిమజ్వాలల వెచ్చదనమెందుకు?
    వెన్నెల్లో సయనించ పరుపెందుకు??
    ఒంటరికి మరో ఒంటరి తోడు చాలదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్పందించమంటే మరీ ఇలానా. ఇప్పుడు నేనేం బదులివ్వాలి. హిమజ్వాలలు సంతోషదుఃఖాల
      సంఘర్షణలు. నా భయం హిమం కరిగిపోయి జ్వాల మిగిలిపోతుందేమో అని. జ్వాలే ఆరి
      బాధ కరిగిపోవాలని నా ఆశ. వెన్నెలనే పరుపు చేశాను... కలల లోకంలో విహిరిస్తే ఆ మనసు తేలికపడుతుందని. ఒంటరికి మరో ఒంటరి తోడు... నిజమే ఈ ఆలోచనే రాలేదండి. ఒంటరి మనసుని ఒంటరిగానే వదిలేశాను. ఎంతైనా మనసు లోతు తెలుసుకోడం కష్టమే.
      చాలా మంచి స్పందన... పద్మగారు. థాంక్యూ.

      తొలగించండి