Powered By Blogger

15 జనవరి, 2014

మనసు-అంతరాత్మల మధ్య సంఘర్షణ




ఇట్స్ ట్రూ...
మనిషి చచ్చిపోయాడు... 
మనసూ చచ్చిపోయింది...
నవ్వెన్ని చెప్పినా సరే...
నేను చెప్పిందే నిజం...

నో... ఇట్స్ రాంగ్...
మనిషి బతికున్నాడు
మనసే చచ్చిపోయింది
మనసు చచ్చిన మనిషి 
నిర్జీవంగా బతికేస్తున్నాడంతే...

నాన్సెన్స్.... షట్ యువర్ మౌత్
మనసు చస్తే... 
మనిషి బతకడమేంటి
వాడూ చచ్చినట్టే...
మనసు లేదు... మనిషీ లేడు.. అంతే

కూల్ మ్యాన్... కూల్
మనసున్న వాళ్లే లేరనకు
మనిషి ఉనికే ఉండదప్పుడు
ఈ వాదనే లేదిప్పుడు
మనసు మాయలో పడింది.. అంతే

యూ...... స్టుపిడ్...
నీ వాదం చాలించు
ఎక్కడుంది మంచి, సంస్కారం
వీధుల్లోకి వెళ్లి చూడు...
బంధాల్లోకి తొంగి చూడు... అప్పుడు మాటాడు

హహహ.... లైట్ డ్యూడ్
బంధాల్లో నటనే ఉండొచ్చు
మానవ మృగాలే సంచరిచ్చొచ్చు
మనసున్న మనుషులనూ చూడు
బురద గుంటలో కమలం వికాసించదూ...

షిట్... యూ ఆర్ ఏ హిపోక్రాట్
నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావ్
నన్నూ... వంచిస్తున్నావ్ 
ఈ అబద్ధాలతో బతుకున్న నటుడివి.. నువ్వు
మనిషిలో మనిషి లేదు.. ఇదే నిజం

ఐ పిటీ యూ...
అమ్మే లేదంటావా...
అమ్మదనం కాదనగలవా...
అమ్మ పాలతో స్వచ్ఛంగా పెరిగినవారే అంతా
మధ్యలో మాయా వంచన ఇదంతా
షట్ అప్... 
పుట్టే వరకే మనిషి... ఆపై కాదు
మరెందుకు అత్యాచారాలు, ఈ ఘోరాలు
మతోన్మాదాలు, కులచిచ్చులు...
చేతనైతే బదులివ్వు.. ఫ్రెండ్..

యస్.. యూ ఆర్ రైట్
ఆ వర్గం వేరు... అది జంతుసమూహం
నువ్వెప్పుడైనా అలాంటి ఘోరం చేశావా
లేదే.. మరి నీకు మనసు లేనట్టా.
ఈ వాదమంతా.. నీది కాదు.. నీ మనసుదే.. కాదంటావా

నో.....నో....నో
ఆ జంతు సమూహంలోనూ మనుషులేగా
జంతువుల పరువెందుకు తీస్తావు...
మనసు చచ్చింది.. ఈ ప్రపంచం నాకొద్దు...
నా చుట్టూ ఉన్నది మనసు లేని మనుషులే

నో.. ఫ్రెండ్
నీ మనసు మంచిది..
ఆ మంచిని పంచు మిత్రమా
మనసున్న వాళ్లే మనసు లేదంటే
నిజంగానే.... మనిషి లేనిదే అవుతుంది పుడమి

బట్... (విత్ టియర్స్) 
మంచి చెప్తే వినేవారెవరు
నా ఆవేదన చల్లారేదెలా..
నీలా నేను భరించలేను...
మనసుని రాజీ పడమనలేను


ఓ మై ప్రిషియస్ ఫ్రెండ్... రిలాక్స్
మనసున్న మనసువి నువ్వు
నీలాంటి మనసులింకెన్నో...
అందుకే మనసు, మంచీ చావలేదు... 
చెడు ఓ గ్రహణం అంతే... తాత్కాలికం

ప్రభవించిన అరుణంలా 
మంచి మనసులు వికసించిన నాడు
నీ ఆవేదన పున్నమిలా చల్లబడుతుంది
ఒంటరిగా రోధిస్తే ఫలితమేముంది...

 ఉఫ్.. ఇక చాలు... 
కమ్ ఫ్రెండ్... లెట్స్ హేవే కాఫీ.... 

 

 

.



 




6 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వ్రాశారు...
    చాల చక్కటి అనాలిసిస్...
    truly...
    realistic argument...
    read again అండ్ again...

    మనఃపూర్వక అభినందనలు...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇది పూర్తిగా మనోతత్వం. ఒక్కోసారి మనసు అన్నిటికీ ప్రేరేపిస్తుంది. అంతరాత్మ వద్దనే చెప్తుంది.
      ఈ శరీరం మీడియం. దీంతో మనసు ఎన్నో పనులు చేయిస్తుంది. అందుకే మనసు-అంతరాత్మల మధ్య సంఘర్షణకు అంతూదరీ లేదు. నేను అర్థమయ్యేలా రాశానో లేదో నాకు తెలీదు. బట్ ఈ ప్రయత్నాన్ని అభినందించినందుకు మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి.

      తొలగించండి
  2. నాకు అసలు ఈ మనస్సుకూ, అంతరాత్మకూ బేదం తెలీదు,
    మీ కవిత చాలా విషయాలను చర్చించింది, నెగటివ్, మరియూ పాజిటివ్ .
    మనస్సు విషయానికొస్తే... అది చాలా చెప్తుంది. చాలా ఆశిస్తుంది, అది చేయవచ్చా కూడదా అనేది మస్తిష్కం నిర్ణ్యిస్తుంది, అది తప్పయితే... దాన్ని ఖండిస్తూ అంతరాత్మ గోషిస్తుంది.... (అమ్మయ్యా కొంతవరకూ క్లారిటీ వచ్చినట్లుంది :-)).
    ఇకపోతే... మీ కవితలో.... హాస్యం తీసుకొని ఉంటే ఇంకా రాణించేది.చదవటములో ఇంట్రెస్ట్ వస్తుంది.(ఇది నా అబిప్రాయం మాత్రమే),
    మంచి మనసు అందరికీ ఉండదు ఉన్న వారు కలకాలం అలాగే తమ మంచిని పదిమందికీ పంచాలని ఆశిస్తూ... మెరాజ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎక్సాట్లీ మెరాజ్ గారు. మానవ నాడీ వ్యవస్థలో ఆ పైవాడు చాలా చిత్రాలు పెట్టాడు.
      కర్తకర్మక్రియ అంతా అందులోనే ఉంటుంది. మనసు చెప్పింది చేసేసి ఆ తర్వాత అంతరాత్మ వద్దని చెప్పింది గుర్తుచేసుకునే ఇంట్రావర్ట్ ల గురించే ఇదే రాసింది. మనసు చెప్పింది గుడ్డిగా
      చేసుకెళ్లిపోయి తానే గొప్ప అనే సుపీరియారిటీలూ ప్రమాదమే. ఇంట్రావర్ట్ లే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మనతో మనం కాసేపు మాటాడుకుంటే... తీరని సమస్య అంటూ ఉండదూ అని చెప్పే ప్రయత్నం ఇది. ఇందులో హాస్యాన్ని కావాలనే చొప్పించలేదు. అర్థం దెబ్బతింటుందని. అందుకే సంవాదాన్నే ప్రధానంగా తీసుకున్నాను.
      చాలా మంది విశ్లేషణ చేశారు మీరు. థాంక్యూ సో మచ్.

      తొలగించండి
  3. అందరూ ప్రతి రోజూ శారీరక శుభ్రత పాటించినట్లే మానసిక శుభ్రత కూడా పాటిస్తే...సమాజం బాగుపడుతుందేమో , సతీష్ గారు కవిత బాగుంది .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి వ్యక్తిత్వ వికాస సూత్రం. మానసిక శుభ్రత. మంచి గాలి, మంచి తిండి, మంచి బట్టలు,
      మంచి జీవితం, మంచి స్నేహాలు, మంచి కుటుంబం.. ఇలా మనకు కావాల్సినవన్నిటికీ
      మంచిని కోరుకుంటాం. అవతలి వాళ్లకి ఇచ్చేటప్పుడు మాత్రం ఆ మంచిని మర్చిపోతుంటాం.
      మంచి సమాజం కావాలంటాం. కానీ సమాజానికి మనం చేసే మంచి ఎంత అంటే... ఎవరి దగ్గరా సమాధానం దొరకదు. పొద్దున్నే ఏ కాలుష్యమూ లేని ఆ ప్రభాత కిరణాల్లా... మీరన్నట్టు స్వచ్ఛమైన ఆలోచనలతో మనసుని శుభ్రం చేసుకుంటే ఈ గొడవే ఉండదు. థాంక్యూ శ్రీదేవి గారు.

      తొలగించండి