Powered By Blogger

19 నవంబర్, 2013

పచ్చిక బయళ్లలో ముత్యాల జల్లు.. కోకిల వేణుగానం

స్వాతిచినుకుకి నమ్మకం
సంద్రం మనసు గెలవగలనని
అందుకే అంత సంద్రాన్నీ ఈదింది
ముత్యపు చిప్పులో ఒదిగి ముత్యమైంది

గడ్డిపరకకు తెలుసు తన బలమెంతో
అంత పెద్ద భూమాత మనసేంటో
అందుకే భూమినే చీల్చుకుని వచ్చింది
భూమాతకు పచ్చదనాల పసిడి చీరకప్పింది

కోకిలకు తెలుసు తన పాటేంటో
నలుపైతేనేం నల్లనయ్య కాదా అనుకుంది
మావిచిగురుతో స్నేహం చేసింది
కూకూ అంటూ సరిగమలకే పాఠాలు నేర్పింది

ఒదగి ఉండలేనే అనుకోలేదు వెదురు
వాయువునే అలింగనం చేసుకుంది
పదహారు వేలమందికి సాధ్యం కానిది... 
వేణువై మాధవుడినే వశం చేసుకుంది





2 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. థాంక్యూ అండి... ఏదో కథలు రాసుకునేవాడిని, స్టోరీ కాన్సెప్టులు ప్రిపేర్ చేసుకుంటూ
      క్షణం తీరిక లేని విలేఖరిని. మళ్లీ నా పాత రోజులను మళ్లీ రప్పించారు. మీరు రాస్తుంటే
      ఒకప్పుడు నాకు నేనే గుర్తొస్తున్నాను. హడావిడి జీవితంలో కాస్త సిరా చిలికిస్తున్నాను. మీకు ధన్యవాదాలు.

      తొలగించండి