Powered By Blogger

7 నవంబర్, 2013

ఈ ప్రశ్నలకు బదులివ్వొద్దు...

భావోద్వేగాలంటే ఏంటి..
మనోభావాలు అంటే ఏంటి..
అవెందుకు వస్తాయి...
అంసంతృప్తితోనా, విద్వేషంతోనా..

అసంతృప్తికి సంతృప్తి సమాధానం
విద్వేషానికి ప్రేమ సమాధానం
మరి తెలిసీ అవెందుకు వస్తాయి
తెలిసీ తెలియనట్టు నటనలెందుకు వస్తాయి

అసలు శత్రువులెవరు..
మనుషులా... ఆలోచనలా
మనుషులే అయితే ఎలాంటి మనుషులు
ఆలోచనలే అయితే ఎలాంటి ఆలోచనలు


మనుషులు నిలబడేది ఎక్కడ
కూలిపోతే కాలేది ఎక్కడ
మట్టి మనుషులను పెంచలేదా
మరి మనుషులు మట్టిని పంచుకుంటున్నారెందుకు

ప్రాంతాలు పంతాలు పెంచుతాయా
పంతాలు పంపకాలు కోరుతాయా
పంపకాలు మనుషులను విడదీస్తాయా
లేక మనుషులే మనుషులను విడదీస్తున్నారా

కొన్నేళ్లుగా తొలిచేస్తున్న సందేహాలివికొన్నాళ్లుగా  నలిపేస్తున్న ప్రశ్నలివి
కానీ.. సమాధానాలు ఎవరూ చెప్పొద్దు
ప్రశ్నలే బాగున్నాయి... బదుళ్లు మెదళ్లు తొలుస్తాయి

9 కామెంట్‌లు:

  1. Satish chaalaa chaalaa,bagundi,suppero super...mee tapaalanni chaalaa bagunnaayiiii:-):-):-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండి... ఇంత అద్భుతంగా స్పందిస్తే... కలం కదం తొక్కకుండా ఎలా ఉండగలదు

      తొలగించండి
  2. హమ్మయ్య....జవాబులు చెప్పొద్దు ప్రశ్నలే బాగున్నాయి అని బ్రతికించారు ;-) ( నాకు జవాబులు తెలియవుగా)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండి... జవాబులు చెప్తే అందులోంచే ఏ ప్రశ్నలు పుడతాయో.. మళ్లీ వాటి జవాబులు
      వెతుక్కోవాలి. ఇదో అంతులేని కథ. థ్యాంక్యూ.. మధురమైన స్పందనకు.

      తొలగించండి
  3. సతీష్‌.. ఆవేదన వల్ల మిగిలేది గుండె బరువే..
    జవాబులు లేని ప్రశ్నల వల్ల మెదడులోనూ హృదయంలోనూ బోలెడంత మెమొరీ స్పేస్‌ వేస్ట్‌ అవుతుంది.
    ప్రశ్నలను కూడా పట్టించుకోని స్థితికి చేరగలిగితే వైయక్తిక జీవితమైనా సాఫీగా నడుస్తుంది.గుడ్డెద్దు చేలో పడిన సామెతలోలాగ.
    'ఆర్‌' తెలుసు కదా.. అదే విధానంలో ముందుకు పోతూ...
    నచ్చినా నచ్చకపోయినా... ఆయన విధానమే కొన్నిసార్లు ఆచరణీయమేమో.
    (ప్రశ్నల బరువు నిండిన గుండెల ఆవేదనతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సర్... మీరిచ్చిన బదులు.. మీకు నాకు మాత్రమే తెలుస్తుంది. ఆర్ ని ఫాలో కావడమే
      కొన్ని సందర్భాల్లో నయం. ప్రశ్నలతో మిమ్మల్ని వేధించడంలో ఉన్న హాయి.. ఎంతో..
      నాకే తెలుసు. ఎలా ఉన్నారు సర్. మీతో చాలా డిస్కషన్ ఉంది. ఎప్పుడు కలుద్దాం.

      తొలగించండి
  4. స్వాతిచినుకు అంటే ఏంటి? సర్

    రిప్లయితొలగించండి