Powered By Blogger

22 జులై, 2012

అదీ లెక్కంటే...

కాలం.. ఇదో పెద్ద మిస్టరీ. ప్రపంచం మీనమేషాలు
లెక్కపెడుతున్ననాడే... భారతీయులు వాటిని నమిలి మింగేసి
పంచాంగాలు రాసేశారు. మనకు తెలిసింది సెకన్లు, మిల్లిసెకన్లు...
ఇంకా గట్టిగా మాటాడితే నానో సెకన్లు. ఆ అంకెల లంకెలు...
మిగిలిన ప్రపంచాల చరిత్రలు పురుడు పోసుకోకముందే..
వేసేశారు.. మన వాళ్లు. చీకటి గదిలో ఒక సూర్యకిరణం చొరబడిందనుకోండి. అందులో కొన్ని కోట్ల
సూక్ష్మ రేణువులు కనిపిస్తాయి. వాటిలోంచి ఒకేఒక రేణవుని తీసుకుని
తూస్తే... దాని బరువుని త్రస అంటారుట. ఆ త్రసలోనూ ముప్ఫై
పరమాణువులుంటాయని పరమాణువు అంటే ప్రపంచానికి
తెలియని రోజుల్లోనే లెక్కకట్టేసి చేతులు దులిపేసుకున్నారు..
మన ప్రాచీన మేధావులు.

అంతెందుకు మహాభారతాన్నే తీసుకోండి... ఒక రధం, ఒక ఏనుగు, మూడు
గుర్రాలు, ఐదుగురు సైనికులు మొత్తం పదిమంది బృందాన్ని పత్తి అని
అనేవారు. పత్తికి మూడు రెట్లుంటే సేనాముఖం, దానికి మూడురెట్లుంటే
గుల్మం. మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం. మూడు గణాలు కలిసి వాహిని.
దానికి మూడింతలు పృతన. దాన్ని మూడుతో గుణిస్తే ఒక చమూ. ముడు
చమూలు ఒక అనీకినీ. దానికి పదిరెట్లు అక్షౌహిణి. కురుక్షేత్రంలో మొత్తం
18 అక్షౌహిణులు. పై లెక్క ప్రకారం ఎంతో లెక్కగట్టండి.
ఇక సంఖ్యామానంలో మనవాళ్లకు తిరుగే లేదు. వెయ్యి కోట్లు దాటాక
ఆ సంఖ్యకు ఒక్కో సున్నా చేర్చుకుంటూ పోతే అర్బుదం, ఖర్వం, పద్మం,
క్షోణి, శంఖం, క్షితి, క్షోభం, నిధి, పరతం, పరార్ధం, అనంతం, సాగరం,
అమృతం, అచింత్యం, మహాభూరి వరకు లెక్కేసేశారు. మహాభూరి అంటే
ఒకటి పక్కన 25 సున్నాలు. ఓ ఆంగ్లం లో చెప్తే గానీ  అర్ధం కాదు కదూ
టెన్ టు ది పవరాఫ్ ట్వంటీ ఫైవ్. ఆ అంకెకు ఆంగ్లంలో ఇప్పటికీ ప్రత్యేకమైన
నామకరణం లేదు.
జీవి పుట్టిన నిమేషం నుంచి ఆయువు ప్రారంభమవుతుందని
శివపురాణం చెప్తోంది. నిమేషం అంటే ఒక్క క్షణం. శివపురాణం
లెక్కలో 15 నిమేషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ.
ముప్ఫై కళలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక ఆహోరాత్రం.
అదే నేడు వ్యవహరిస్తున్న రోజు. ఇవి కాక.. లిప్త, తృటి లాంటి సూక్ష్మ కొలతలెన్నో... ఇప్పుడు
అగ్రరాజ్యాలని మిడిసిపడుతున్న కొన్ని దేశాలు పుట్టక ముందే
విస్తృతంగా భారతదేశంలో వాడకలో ఉన్నాయి. లిప్త అంటే
కనురెప్పపాటు.
తృటి లెక్క బహువిచిత్రం. తామర రేకుల కట్టను.. ఓ పదునైన సూదితో
పొడిస్తే.. ఒక రేకు నుంచి మరో రేకుకి పట్టే సూదిమొన ప్రయాణ
కాలాన్ని లవం అంటారు. అలాంటి లవాలు ముప్పై కలిస్తే.. అది
తృటి. తృటిలో తప్పిన ప్రమాదమంటామే.. ఆ తృటి. ఇప్పటికీ
వాడుకలో ఉంది. ఇంత గొప్ప కాలమానం ఉంటే. మనకు ఆంగ్లజాడ్యం.





18 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు... కొంచెం తెలుగులో చెప్తే ఇంకా ఉత్సాహంగా ఉండేది.

    రిప్లయితొలగించండి
  2. మొత్తంగా లెఖ్ఖ వేస్తే 21870 రధములు, 21870 ఏనుగులు, 65610 గుఱ్ఱాలు, 109350 పదాతులు కలిపి ఒక అక్షౌహిణి. హమ్మయ్యా నేను చెప్పానోచ్చ్ :)లెక్క కట్టాను కనుక నా బహుమతి ఏదీ? :):)
    రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు. మూడు అణువులు ఒక త్రెస రేణువు. ఇటువంటి మూడు త్రెస రేణువులు దాటడానికి సూర్యునికి పట్టే కాలం ఒక తృటి. వంద తృటులు కలిపి ఒక వేద, మూడు వేదలు ఒక లవం, మూడు లవాలు ఒక నిమిషం అని చదివినట్టు గుర్తు. మీరు చెప్పినట్టు లవం నుండి తృటి అని నేను వినలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కణాదుడు పరమాణువుల గురించి విస్తృత అధ్యయనం చేసిన తొలి
      పరమాణు శాస్త్రవేత్త. ఆయన వివరణ ప్రకారం అణువు పరమాణువుల
      సమూహం. అణవు కన్న త్రస బరువు తక్కువ. ఇదో సిద్ధాంతం
      ఐన్ స్టీన్ కి వేల ఏళ్ల క్రితమే శూన్యవాదాన్ని విశదీకరించిన నాగార్జునుడు
      పరమాణువులపై చేసిన పరిశోధనల్లో మీరు చెప్పినటువంటి లెక్క ఇదమిదం
      గా ఎవరో చెప్తే విన్నట్టు గుర్తు. మీరు చెప్పిన లెక్కా కరెక్టే. అక్షౌహిణిల లెక్క సరిగ్గా వేశారు. మీకు బహుమానంగా నేనేమివ్వ గలనూ ఆలోచిస్తే... ఒక మంచి ఈ-పుస్తకం ఇవ్వాలనిపించింది. మీ మెయిల్ కి ఎటాచ్ చేస్తాను.
      ధన్యవాదాలు రసజ్ఞ గారు.

      తొలగించండి
  3. భారతం చదవండి. వివరాలు ఇంకా తెలుస్తాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను రాసింది భారతంలో వివరాలే కష్టే ఫలే గారు.
      అయినా మీ సూచన తప్పకుండా పాటిస్తాను

      తొలగించండి
  4. కాలాన్ని అలా నిర్వచించినా, ప్రమాణీకరించక పోవడం వల్ల ఆ లెక్కలు ప్రాచుర్యంలోకి రాకపోయాయేమో. ఆ పురాణ నిర్వచనాలు బాగా వున్నా గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టం కాబట్టే అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ ఏర్పరచాల్సిన అవసరం గుర్తించారు. బ్రిటీష్ సిస్టం ఫుట్-పండ్లు-గ్యాలన్ ఏవో కొన్ని అమెరికా, బ్రిటన్లు లాంటి తలబిరుసు దేశాల్లో తప్ప చాలాదేశాల్లో అనుసరింపబడటం లేదు.

    ఈ నిర్వచనం చూడండి:
    /తామర రేకుల కట్టను.. ఓ పదునైన సూదితో పొడిస్తే.. ఒక రేకు నుంచి మరో రేకుకి పట్టే సూదిమొన ప్రయాణ కాలాన్ని లవం అంటారు./
    ఆ కాలం ఆకుల మందం, స్థితి, సూది వ్యాసం, పొడిచేవారిని బట్టి మారిపోతుంది.

    పైన లిప్త, నిమేషానికి పెద్దగా తేడా వున్నట్టనిపించదు. రెండు పరమాణువులు ఒక అణువు నిర్వచనం క్లియర్‌గా లేదు. ఖచ్చితత్వం, సరళంగా వుండే విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇందుకు బాధపడటం సరికాదనిపిస్తుంది.

    / హమ్మయ్యా నేను చెప్పానోచ్చ్ :)లెక్క కట్టాను కనుక నా బహుమతి ఏదీ? :):)/
    మీ బహుమతి అదే వరుసలో చెప్పిన విక్కీ వాడు లాక్కున్నాడు. :D
    http://en.wikipedia.org/wiki/Akshauhini

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును మీరన్నది నిజమే. కానీ.. పునాది వెయ్యడం కష్టం.
      గోడ ఎవరైనా కట్టగలరు. ఆ లెక్కలకు సరైన పునాది మన దేశం
      వేసింది అని ప్రచారం చేయడం భావ్యమైపోయింది. అహోరాత్రంలో
      హూర అంటే గంటకు సమానం. ఆ హోర అనే శబ్దంలోంచే హవర్
      పుట్టిందని అనుకుంటే తప్పేమీ లేదు. ఇప్పటికీ పరమాణువులపై
      పరిశోధనల గురించి నానా అవస్థలు పడుతున్న శాస్త్రవేత్తలకు
      ఎప్పుడో మనవాళ్లు బేసిక్స్ అందజేశారు. ఇప్పుడున్న శాస్త్రీయ
      ప్రపంచంలో కొత్తగా కనుక్కున్నదేమీ లేదు. ఉన్న సిద్ధాంతాలకు
      మెరుగుపెట్టడం తప్ప. ధన్యావాదాలు

      తొలగించండి
    2. నేనాన్నది ఆ పునాది మనమే వేశామని కాదు, మాయన్, చైనీస్, గ్రీకు, ఈజిప్తియన్ లాంటి ప్రాచీన నాగరికతలు కూడా పునాదులు వేశారు. ఆ వేసిన పునాదులు సరిగా లేనందువల్ల వాటిని తీసేసి, స్టాండర్డైజేషన్ చేయాల్సిన అవసరం గుర్తించి, సరిచేసే ప్రయత్నంలో మొత్తం పునాదులు కదిలించి కొత్తగా కాంక్రీటుతో వేయాల్సి వస్తోంది, అని నా పాయింట్. హోర నుచే హవర్ వచ్చిందనుకుని గర్వపడితే తప్పేమీలేదు.
      ఇప్పుడు తామరాకులకు తూట్లు పొడిచేలాంటి నిర్వచనాలు కాక మరింత నిర్ధిష్టంగా "The second is the duration of 9,192,631,770 periods of the radiation corresponding to the transition between the two hyperfine levels of the ground state of the caesium 133 atom". అని నిర్వచించారు. ఇందులో egoలు దెబ్బతినాయని భావిస్తూ శాస్త్రవేత్తలను ఈసడించడం సరికాదేమో అని నా భావన.
      ధన్యవాదాలు.

      Ref: http://en.wikipedia.org/wiki/Time

      తొలగించండి
    3. /ఆ హోర అనే శబ్దంలోంచే హవర్ పుట్టిందని అనుకుంటే తప్పేమీ లేదు/
      హోర నుంచి వాళ్ళకి హవర్ పుట్టింది, మరి మనకో? పులి-హోర పుట్టింది! అది తేడా.. :)) (సరదాగా)

      తొలగించండి
    4. పులిహోర కాదు మేషాలు పులిహార... ప్రాచీన నాగరికతలో
      వేసిన పునాదుల మీద ప్రపంచం ఇళ్లు కట్టుకుంది. మీరంటున్న
      స్టాండర్డైజేషన్ అప్పుడూ ఉంది. తృటిలో తప్పింది అని ఇప్పటికీ
      అంటున్నం తప్ప... ఆ తృటికి నిర్ధిష్ట ప్రమాణం లేకుండానే
      మన వాళ్లు వాడారంటారా. అంత వెర్రిబాగులవాళ్లేం కాదండి.
      ప్రతీదానికి నిర్ధిష్ట ప్రమాణం ఉంది. దాని శుబ్రంగా మనవాళ్లు,
      మీరన్న ఈజిప్షియన్లు, మయన్లు కూడా రాసి పెట్టారు. మీకో
      విషయం తెలీదనుకుంటా.. వారానికి ఏడు రోజులు అనే ప్రమాణం
      భారతీయులది. 1800 దాటే వరకు మిగిలిన ప్రపంచానికి ఒక
      నిర్ధిష్ట క్యాలెండర్ లేదంటే నమ్ముతారా. ఆనాటికే వేళ్ల మీద వేల ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాలను కూడా లెక్క
      గట్టేంత అడ్వాన్సుడు పంచాంగం.. క్రీస్తుపూర్వమే వాడుకలో ఉంది.
      ఇవి నిర్ధిష్ట ప్రమాణాలు కావు అని ఈ ప్రపంచంలో ఎవడైనా రుజువు
      చేయగలడా. ఇంత అడ్వాన్సుడు అంటున్నారే. మరి మయన్స్ డిశెంబర్ 21
      తో క్యాలెండర్ ముగిస్తే యుగాంతం అని భయపడి ఛస్తున్నారెందుకు. పిరికి
      దద్దమ్మలు. మన క్యాలెండర్లో యుగాంతం లేదు.. ఇన్ఫైనేట్ కదా మరి.

      తొలగించండి
    5. భగవద్గీత చాలా సునిశితంగా పరిశీలించిన వ్యక్తుల్లో ఐన్ స్టీన్
      ఒకరని చాలామందికి తెలీదు. ఎవరైనా భారతీయుడు
      ఆయనకు తారసపడితే.. మొట్టమొదట ఒక ప్రశ్న వేసేవాడట
      అది.. నీకు సంస్కృతం వచ్చా అని. ఒక వేళ ఎదుటి వ్యక్తి
      రాదు అని చెప్తే.. భారతీయుడివయ్యుంది.. సంస్కృతం రాదా..
      అని కిందామీదా చూసేవాడట. అలాంటి ఐన్ స్టీన్ భారత దేశ
      పరిశోధనల గురించి ఒక పెద్ద సదస్సులో చర్చిస్తూ... ఓసారి..
      "భారతీయులు గనక సున్నాను కనిపెట్టకపోయి ఉండి ఉంటే
      మనం చేసిన పరిశోధనలన్నీ వృధా అయ్యేవి.." అని అన్నాడు.
      భారతదేశం మాత్రమే గొప్పదని నా అభిప్రాయం కాదు. భారతదేశం
      చాల గొప్పదేశమని ఎన్నో పరిశోధనలకు పునాదులు వేసి ప్రపంచానికి
      అందిచిన దేశమని మేధావులే అంగీకరించారు.

      తొలగించండి
    6. http://en.wikipedia.org/wiki/Pulihora
      భగవద్గీతలో ఐన్‌స్టీన్ సున్నా ఎక్కడ చూశాడోగాని, మీ మేషాలు పులిహార ( మేక బిర్యానీనా?!) నాకు తెలియదు కాని, గుళ్ళలో ప్రసాదంగా పెట్టె పులిహోర విషయంలో నాకు చిన్నప్పటినుంచి ఖచ్చితమైన అభిప్రాయాలు వున్నాయండి. :) పై లింక్ చూడండి ha కాదు hO అనే రాశారు.
      పంచాంగం, ఖగోళ గణితం ఒప్పుకోవచ్చు కాని లవం, తృటి, లిప్త పేర్లు బాగున్నాయి కాని డెఫినిషన్ నాకంత నచ్చలేదండి. సున్న ఘనత మనదేకాని, మనం సున్నతో ఆగిపోతే, ఆ తర్వాత విదేశీయులు కొనసాగించారు. మన దేశ ఘనత ఐన్‌స్టీన్ ప్రస్తావించడం ఆయన హుందాతనం అనుకోవాలి. కణం అంటే కణ్వముని మనవాడు, కాబట్టి ఆయన తండ్రి గారు అటామిక్ ఫిజిక్స్‌కు ఆద్యుడనుకోవడం సరికాదేమో. త్రసలో 30 పరమాణువులున్నాయని చేతులు దులిపేసుకున్నారన్నారే, ఆ ధూళి పరమాణువు ఈ పదార్థ పరమాణువు ఒకటి కానే కాదని ఖచ్చితంగా చెప్పగలనండి.
      ఏది ఏమైనా... మీరు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా వున్నాయి, ధన్యవాదాలు.

      కామెంట్ పెట్టిన ప్రతిసారి నన్ను మీరు రాబోటా? అని మీరు అనుమానంగా ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను.
      "మాను, మాకును కాను
      రాయి, రబోట్ కానే కాను
      మామూలు మనిషిని నేను...
      మీ మనిషిని నేను! " అన్న P.సుశీల పాటనే హమ్ చేస్తున్నా. :)

      తొలగించండి
    7. రాబోటా? అలా ఎక్కడ రాశానూ.. అసలలా సంబోధించనే లేదు కదండి.
      కణాదుడు ఆద్యుడో కాదో గానీ.. పరమాణువుల గురించి అప్పుడే ఆలోచించడం
      అద్భుతమే కదా. విదేశాభిమానం ఉండడంలో తప్పు లేదు. కానీ..
      మన దేశానికే గర్వ కారణమైన విషయాలు పంచుకోడం... ఇతరులకు
      ఇంత బాధ కలిగిస్తుందని ఇప్పుడే తెలిసింది. బైదీబై మీరు మీకన్నా
      ఎక్కువగా వీకిపీడియాను నమ్ముతారనుకుంటా. వికీపీడియాలో ఉన్న
      సమాచారంలో చాలా దోషాలున్నాయని... మీ విదేశీ మేధావులే ఈ మధ్యే
      తేల్చారు. అన్ని న్యూస్ పేపర్లలో వచ్చిందే. ఏది ఏమైనా.. ఈ మాత్రం
      వాదనలు లేకపోతే... కిక్కుండదు. ధన్యావాదాలు

      తొలగించండి
    8. :)) స్వదేశి అభిమానం మంచిదే, దురభిమానం కూడదు. వికీ మీద విదేశీమేధావులు తేఇస్తే మీరెలా నమ్మారు?! నమ్మకూడదండి. :)

      రాబోట్‌వా? అని మీరుంచిన వర్డ్ వెరిఫికేషన్ అలా అడుగుతుంది, తీసేయగలరు. ఇదంతా విదేశీయుల కోసం. తెలుగు నేర్చిన రాబోట్లు ఇంకా పుట్టలేదు. :)

      తొలగించండి
  5. విచిత్రం ఈ కణాదుడు గుడ్డివాడు. pl remove word verification

    రిప్లయితొలగించండి