Powered By Blogger

27 జనవరి, 2017

'చిదంబర రహస్యం' గుట్టు తెలిసిపోయింది.....

అందరికీ నమస్సులు. 5 వేల ఏళ్ల క్రితమే ఓ తమిళ భక్తుడు చిదంబర రహస్యాల గురించి ఏం రాశాడు..? అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి? కాస్మో ఫిజిక్స్‌ థియరీ ఆధారంగా ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఇవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారిని వెంటాడుతున్న ప్రశ్నలు. కానీ,ఈ ఆలయ నిర్మాణం వెనుక, ఆలయం అంతరార్థం ఆశ్చర్య పరుస్తుంది. ఈ డాక్యుమెంటరీ చూడండి. మన భారతీయ అద్భుతాలను ఇలాంటి డాక్యమెంటరీలుగా రూపొందిస్తున్నాం. ఇది మా రెండో యూట్యూబ్ ఛానెల్‌. పెద్దలు మిత్రులు తమ subscriptionతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.

21 జనవరి, 2017

శ్రీ చాగంటి వారి జీవిత సత్యాలు | inspiring golden words of sri chaganti ...







శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాల్లోంచి తీసుకున్న అద్భుత వాక్యాలు. ప్రతీ ఒక్కరి జీవితానికి, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేందుకు ఉపయోగపడే పాఠాలివి. ఆయన ప్రతీ ప్రవచనం ఓ అద్భుతం. ఇంటింటా రామాయణం, భారతం, భాగవతం. ఆధ్యాత్మిక చింతన నింపే పారాయణం. ఈ అమృత వాక్కుల దృశ్య మాలికను చూడండి.

20 జనవరి, 2017

ప్రశాంత నిద్ర కోసం...

అందరికీ నమస్సులు. ఇది పిల్లలకు చాలా ముఖ్యమైన శ్లోకం. రాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు... వీళ్లంతా భయానికే భయం పుట్టించే ధీరులు. ఆ నలుగురిని స్మరిస్తే నిద్రలో పీడకలలు రావు. ప్రశాంతంగా పిల్లలు నిద్రపోతారు. నిద్రకు ముందు ఈ శ్లోకం పఠిస్తే... మెదడు ఆధ్యాత్మిక చింతనతో నిండుతుంది. పడుకునే ముందు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే కలగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సైన్స్ చెప్తోంది. మరి ఆధ్యాత్మిక చింతనతో నిద్రపోతే... సైకాలజీ ప్రకారం చెడుకలలు వచ్చే అవకాశం లేదు. ఈ సైకాలజీ... మన పెద్దలకు ఎప్పుడో తెలుసు. అందుకే ఈ శ్లోకాన్ని పిల్లలతో పఠింపచేసి పడుకోమని చెప్తారు. ఈ కాలానికి తగ్గట్టు... పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ లిరిక్స్ తో రూపొందించాం. వినండి, పిల్లలతో పాడించండి. 

13 జనవరి, 2017

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినంతో మొదలు ఈ సంవత్సరమంతా అందరి ఇళ్లల్లో క్రాంతులు నిండాలని ఆశిస్తున్నాం. ఆద్య మీడియా న్యూస్, రివ్యూస్‌, వీకెండ్‌ కామెంట్‌, డాంక్యూమెంటరీస్‌, మూవీస్‌ న్యూస్‌తో కూడా మీ ముందుకు త్వరలోనే వస్తోంది. మిత్రులు, పెద్దలు అంతా మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్‌ చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాం.AADYA MEDIA
ఈ లింక్‌పై క్లిక్‌ చేసి subscribe చేసి మీ blessings అందించండి.


12 జనవరి, 2017

ఆనందుని మాటే మా భగవద్గీత...

ఇవాళ స్వామి వివేకానంద 154వ జయంతి. ఆయన జయంతి నాడు జాతీయ యువజన దినంగా జరుపుతున్నాం. దేశాభివృద్ధి అంతా యువశక్తిలోనే ఉందని, యువతలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచిన గొప్ప యోగి ఆనందుడు.
భారతీయ వైదిక ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఆధునిక ఆది శంకరుడు. యువ చైతన్యాన్ని తట్టిలేపిన తొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇప్పటికీ యువతకు ఐకాన్ ఆనందుడే. మనది కాని జనవరి 1న యువత చిందులేస్తోంది. మనది కాని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినం అంటోంది. మనకు అక్కర్లేని అమ్మదినాలు, నాన్న దినాలు సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, భారత దేశ ఆధ్యాత్మిక ఆత్మ, యువతకు మార్గదర్శి వివేకానందుడు మాత్రం చాలా మందికి గుర్తే ఉండరు. ఆయన లక్యాలను స్మరించుకుంటూ..... మా ఆద్య మీడియా నుంచి వివేకానందుడి జయంతికి ప్రత్యేక గీతం రూపొందించాం.
చూడండి...

10 జనవరి, 2017

త్యాగరాజ స్వామిని మర్చిపోతున్నాం....

ఏటా శ్రీ త్యాగరాజ స్వామి వర్థంతి రోజున ఆయన సమాధి చెందిన తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు జరుగుతాయని తెలిసిందే. ఈ జనవరి 17న తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. అందుకే త్యాగరాజ స్వామి వారికి మా ఆద్య మీడియా తరపున సంగీత నివాళి. త్యాగరాజ స్వామికి ఎంతో ఇష్టమైన కీర్తనల్లో ఒకటి బంటురీతి కొలువు. మా సంగీత దర్శకుడు మేఘ శ్యామ్... ఈ కీర్తనను గిటార్ పై పలికించారు. గిటార్ పై ఈ స్వరాలు పలికించడం చాలా కష్టమైన ప్రక్రియ. త్యాగరాజ స్వామి... తెలుగువారు. ఆయన కీర్తనల్లో స్వచ్ఛమైన తెలుగు గుబాళిస్తుంది. అయినా... తమిళనాటే వారి కీర్తనలు ఎక్కువ వినిపిస్తాయి. మన తెలుగువారైన త్యాగరాజు కీర్తనలు మన ఇళ్లల్లో సుస్వరాల జల్లు నింపాలని ఆశిస్తున్నాం. ఈ కీర్తనలో త్యాగరాజు... తనకు కామ,క్రోధ మదాదులను కొనగోటితో సంహరించగల బంటురీతి కొలువు (సైనికుడు లాంటి ఉద్యోగం) ఇమ్మని రాముడిని ప్రార్థించాడు.

5 జనవరి, 2017

సీతా కళ్యాణ వైభోగమే...

అందరికీ నమస్సులు. వైవాహిక బంధం అనగానే వెంటనే గుర్తొచ్చేది సీతారాములే.
ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించనంత గొప్పగా అల్లుకున్న భారతీయ వివాహ బంధం ఆదర్శవంతమైనది.
పెళ్లి అంటే మూడు ముళ్లు మాత్రమే కాదు.. సుఖాల్లోనూ, కష్టాల్లోను ఒకరికొకరు తోడుండాలన్న సత్యాన్ని
సీతారాముల కథ చెప్తుంది. అందుకే యుగాలు గడిచినా ఇప్పటికీ వివాహం అంటే సీతారామ కళ్యాణ వైభోగమే.
అలనాటి సీతారాముల కళ్యాణ వైభోగాన్ని త్యాగరాజ స్వామి వారు వర్ణించిన తీరు మహాద్భుతం.
ఏ పెళ్లిలోనైనా ఈ పాట వినిపిస్తేనే నిండుదనం. అందుకే పూర్తి సాహిత్యంతో... సుస్వరాలతో ఈ పాట
మీకోసం. వినండి...  ఎంత కష్టమైనా ఇట్టే తేలికైపోతుంది.