28 ఆగస్టు, 2017
27 జనవరి, 2017
'చిదంబర రహస్యం' గుట్టు తెలిసిపోయింది.....
అందరికీ
నమస్సులు. 5
వేల ఏళ్ల
క్రితమే ఓ తమిళ భక్తుడు చిదంబర
రహస్యాల గురించి ఏం రాశాడు..?
అసలు చిదంబర
రహస్యం అంటే ఏమిటి?
కాస్మో
ఫిజిక్స్ థియరీ ఆధారంగా ఆ
ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఇవన్నీ ఎన్నో ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ఆసక్తి కలిగిన వారిని వెంటాడుతున్న ప్రశ్నలు. కానీ,ఈ ఆలయ నిర్మాణం వెనుక, ఆలయం అంతరార్థం ఆశ్చర్య పరుస్తుంది. ఈ డాక్యుమెంటరీ చూడండి. మన భారతీయ అద్భుతాలను ఇలాంటి డాక్యమెంటరీలుగా రూపొందిస్తున్నాం. ఇది మా రెండో యూట్యూబ్ ఛానెల్. పెద్దలు మిత్రులు తమ subscriptionతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.
21 జనవరి, 2017
శ్రీ చాగంటి వారి జీవిత సత్యాలు | inspiring golden words of sri chaganti ...
శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాల్లోంచి తీసుకున్న అద్భుత వాక్యాలు. ప్రతీ ఒక్కరి జీవితానికి, వారి వ్యక్తిత్వాన్ని నిర్మించుకునేందుకు ఉపయోగపడే పాఠాలివి. ఆయన ప్రతీ ప్రవచనం ఓ అద్భుతం. ఇంటింటా రామాయణం, భారతం, భాగవతం. ఆధ్యాత్మిక చింతన నింపే పారాయణం. ఈ అమృత వాక్కుల దృశ్య మాలికను చూడండి.
20 జనవరి, 2017
ప్రశాంత నిద్ర కోసం...
అందరికీ
నమస్సులు. ఇది
పిల్లలకు చాలా ముఖ్యమైన
శ్లోకం. రాముడు,
హనుమంతుడు,
గరుత్మంతుడు,
భీముడు...
వీళ్లంతా
భయానికే భయం పుట్టించే ధీరులు.
ఆ నలుగురిని
స్మరిస్తే నిద్రలో పీడకలలు
రావు. ప్రశాంతంగా
పిల్లలు నిద్రపోతారు.
నిద్రకు
ముందు ఈ శ్లోకం పఠిస్తే...
మెదడు
ఆధ్యాత్మిక చింతనతో నిండుతుంది.
పడుకునే
ముందు దేని గురించి ఎక్కువ
ఆలోచిస్తే అదే కలగా వచ్చే
అవకాశం ఎక్కువగా ఉందని సైన్స్
చెప్తోంది. మరి
ఆధ్యాత్మిక చింతనతో నిద్రపోతే...
సైకాలజీ
ప్రకారం చెడుకలలు వచ్చే అవకాశం
లేదు. ఈ
సైకాలజీ... మన
పెద్దలకు ఎప్పుడో తెలుసు.
అందుకే
ఈ శ్లోకాన్ని పిల్లలతో పఠింపచేసి
పడుకోమని చెప్తారు.
ఈ కాలానికి
తగ్గట్టు... పిల్లలకు
ఈజీగా అర్థమయ్యేలా తెలుగు,
ఇంగ్లీష్
లిరిక్స్ తో రూపొందించాం.
వినండి,
పిల్లలతో
పాడించండి.
13 జనవరి, 2017
మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి
పర్వదినంతో మొదలు ఈ సంవత్సరమంతా
అందరి ఇళ్లల్లో క్రాంతులు
నిండాలని ఆశిస్తున్నాం.
ఆద్య
మీడియా న్యూస్,
రివ్యూస్,
వీకెండ్
కామెంట్,
డాంక్యూమెంటరీస్,
మూవీస్
న్యూస్‌తో కూడా మీ ముందుకు
త్వరలోనే వస్తోంది.
మిత్రులు,
పెద్దలు
అంతా మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్
చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాం.AADYA MEDIA
ఈ
లింక్‌పై క్లిక్ చేసి subscribe
చేసి
మీ blessings
అందించండి.
12 జనవరి, 2017
ఆనందుని మాటే మా భగవద్గీత...
భారతీయ వైదిక ధర్మం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఆధునిక ఆది శంకరుడు. యువ చైతన్యాన్ని తట్టిలేపిన తొలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇప్పటికీ యువతకు ఐకాన్ ఆనందుడే. మనది కాని జనవరి 1న యువత చిందులేస్తోంది. మనది కాని ఫిబ్రవరి 14న ప్రేమికుల దినం అంటోంది. మనకు అక్కర్లేని అమ్మదినాలు, నాన్న దినాలు సంగతి చెప్పనే అక్కర్లేదు. కానీ, భారత దేశ ఆధ్యాత్మిక ఆత్మ, యువతకు మార్గదర్శి వివేకానందుడు మాత్రం చాలా మందికి గుర్తే ఉండరు. ఆయన లక్యాలను స్మరించుకుంటూ..... మా ఆద్య మీడియా నుంచి వివేకానందుడి జయంతికి ప్రత్యేక గీతం రూపొందించాం.
చూడండి...
10 జనవరి, 2017
త్యాగరాజ స్వామిని మర్చిపోతున్నాం....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

