నిన్నటి
దారులకు రేపటి వంతెన వేశా
నేడనే
నీడతో బంధాలు పెనవేసి దారి
చేశా
ఆశలతో
ఊసులాడుతూ ప్రయాణిస్తున్నా
కనులు
దాటి వస్తున్న కలలతో పరిగెడుతున్నా
సింధువులో
బిందువెలెన్నో ముత్యాలై
నా
దారిలో చేరి సుగంధ కుసుమాలై
రెక్కల
సవ్వడి చేసుకుంటూ తుమ్మెదలై
నా
జీవన పయనంలో వర్ణచిత్రమై
కదిలాయి
అత్యాశా
వాదినని నన్ను నిందించినా
ఊహాలోక
విహారి అని విమర్శించినా
గమ్యం
లేని సంచారివని నవ్వుకున్నా
ఆశను
బతికించే వైద్యుడనని గర్విస్తున్నా
కథలా
కదిలే నా జీవితంలో మలుపులు
సప్తసముద్రల
కూడలిలా ఒంపులు
స్వప్నాల
దీవిలో స్వర్గాల ద్వారాలు
అందుకే
రండి... నా
ప్రపంచంలోకి.....
ఊహాలోక విహారి అని విమర్శించినా
రిప్లయితొలగించండిగమ్యం లేని సంచారివని నవ్వుకున్నా
ఆశను బతికించే వైద్యుడనని గర్విస్తున్నా
చాన్నాళ్ళకి దర్శనమిస్తూ..అధ్భుతంగా ఆహ్వానించారు.
Continue this Satishgaru.
ఆహ్వానించగానే సరికాదండోయ్...రోజుకో కవితతో కమ్మగా వడ్డించాలి మరి మాకు. మిస్ అయితే గోలచేస్తాం :-) చాలాబాగుంది మీ ఆహ్వానం.
రిప్లయితొలగించండిGood attitude with self confidence
రిప్లయితొలగించండిచాల బాగుంది సతీష్
రిప్లయితొలగించండి