http://harivilu.blogspot.in/2015/11/blog-post_8.html
9 నవంబర్, 2015
5 నవంబర్, 2015
నేడు బుచ్చిబాబు గారి శతజయంతి
http://harivilu.blogspot.in/2015/11/blog-post_24.html?m=1
4 నవంబర్, 2015
నా కొత్త బ్లాగు.............
చాలా రోజుల నుంచి బ్లాగ్ ద్వారా నా జర్నలిజం అనుభవాలు, విశ్లేషణలు, ఆధ్యాత్మిక సంగతులు... ఇలా ఎన్నెన్నో పంచుకోవాలని కోరిక. దానికంటూ మరో బ్లాగ్ ప్రారంభించాను. నా మిత్రులంతా ఆ బ్లాగును కూడా చూసి... నా అభిప్రాయాలను విశ్లేషిస్తారని ఆశిస్తున్నాను
బ్లాగ్ అడ్రస్
harivllu.blogspot.com
బ్లాగ్ అడ్రస్
harivllu.blogspot.com
6 సెప్టెంబర్, 2015
నువ్వొక రక్తాశ్రువు...
ఈ
లోకంలోకి వస్తానని నువ్వనలేదు....
ఈ
లోకం నుంచి వెళ్తాననీ
నువ్వనలేదు.....
మనిషిని
మనిషే పీక్కు తినే లోకంలో....
మతోన్మాదం
మత్తెక్కిన కాలంలో
నువ్వొక
రక్తాశ్రువు.......
ఉగ్రవాద
ఉన్మాద హననంలో.....
మానవత్వం
నశించిన మారణ హోమంలో.....
తుపాకీ
చప్పుళ్ల మధ్య అనాగరిక
నిశ్శబ్దంలో.....
తూట్లు
పడిన పుడమి కన్నీటి సంద్రంలో....
నవ్వొక
రక్తాశ్రువు.......
నీ
మతమేదో నీకే తెలియని వయసు.....
ఉగ్రవాదమన్న
మాటే వినలేదు............
అమ్మ
పరుగులు తీస్తే ఎందుకో అర్థం
కాలేదు......
ఆడుకోడానికే
అనుకున్నావో ఏమో....
బలైపోయావు.......
నువ్వొక
రక్తాశ్రువు.......
నిర్మల
సాగరంలో వటపత్రశాయిలా.....
ఇసుక
తిన్నెల్లో హాయిగా
నిదురిస్తున్నావనుకున్నాను......
తిరిగిరాని
లోకాలకు వెళ్లావా చిన్నారి
నేస్తమా.......
ఉగ్రోన్మాద
వికృత చేష్టకు సమిధవయ్యావా......
అవును....
నువ్వొక
రక్తాశ్రువు
ఇప్పుడెక్కడున్నావు..........?
దేవుడే
ఉంటే ఆ దేవుడి ఒడిలోకి చేరావా?
మానవత్వం
కోసం లోకాలు వెతుకుతున్నావా
?
గుండెపగిలిన
అమ్మ కన్నీటిగా మారావా ?
ఎక్కడున్నా....
మా గుండెల్లో ఎప్పటికీ
నువ్వొక రక్తాశ్రువు....
20 ఆగస్టు, 2015
అందరికీ ఇదే ఆహ్వానం
నిన్నటి
దారులకు రేపటి వంతెన వేశా
నేడనే
నీడతో బంధాలు పెనవేసి దారి
చేశా
ఆశలతో
ఊసులాడుతూ ప్రయాణిస్తున్నా
కనులు
దాటి వస్తున్న కలలతో పరిగెడుతున్నా
సింధువులో
బిందువెలెన్నో ముత్యాలై
నా
దారిలో చేరి సుగంధ కుసుమాలై
రెక్కల
సవ్వడి చేసుకుంటూ తుమ్మెదలై
నా
జీవన పయనంలో వర్ణచిత్రమై
కదిలాయి
అత్యాశా
వాదినని నన్ను నిందించినా
ఊహాలోక
విహారి అని విమర్శించినా
గమ్యం
లేని సంచారివని నవ్వుకున్నా
ఆశను
బతికించే వైద్యుడనని గర్విస్తున్నా
కథలా
కదిలే నా జీవితంలో మలుపులు
సప్తసముద్రల
కూడలిలా ఒంపులు
స్వప్నాల
దీవిలో స్వర్గాల ద్వారాలు
అందుకే
రండి... నా
ప్రపంచంలోకి.....
12 ఏప్రిల్, 2015
ఓ జ్ఞాపకం...
ఏనాడో మనసులో మిగిలిన ఓ జ్ఞాపకం
దాదాపుగా మరుపు ఆవహించిన జ్ఞాపకం
కళ్లెదుట నిలిచి గుర్తుచేసిందా జ్ఞాపకం
కాలచక్రాన్ని ఓ పదారేళ్లు వెనక్కు నెట్టిందా జ్ఞాపకం
ఆనాడు తొలిచూపుని ఆకర్షించిన సౌందర్యం
మనసుని మెలిపెట్టి గిలిగింతలు పెట్టిన కోమలం
ప్రతిరోజూ వసంతమే ఆ వదనం
ప్రేమో, వ్యామోహమో.. మొత్తానికి ఓ అనుభవం
వెంటపడిన రోజులు.. క్షణక్షణం మధురం
చిరునవ్వుల బదుళ్లు... పెంచిన విరహం
క్షణమొగ యుగమయ్యే నిరీక్షణల్లో ఏదో మర్మం
యుగమొక క్షణమే ఆమె కనిపించిన తరుణం
ఇరువురికీ తెలియదే.. అది ప్రేమోఏమో
అడిగిన మరుక్షణం ఏదో భయం... కలవరం
నాటి నుంచి నేటి వరకు ఏమైందో ఆ సౌందర్యం
మళ్లీ... కనిపించి మనసుని మెరిపించింది ఆ జ్ఞాపకం
చిరునవ్వులే పలకరింపుగా స్వగతం
కనుచూపులే పరిచయాల ఆలింగనం
చెరో జీవితం.. పక్కనే పేగు బంధం..
ఆనాడు ప్రేమో ఏమో... నేడది కచ్చితంగా స్నేహం
జ్ఞాపకాల దొంతరల్లో తిరిగిన కాలచక్రం
ఆనుభవాల ఇరుసుల మీద ఆగని ప్రయాణం
ప్రతి మనసులో ఓ అందమైన అనుభవం
విజయమో, వైఫల్యమో... అదో తీయని జ్ఞాపకం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)