Powered By Blogger

6 సెప్టెంబర్, 2014

ఓ భానూదయాన... చంద్రోదయం


ప్రాతఃకాల సమీర వేళ...
మరీచికా వాయులీనాల శృతిలయ
పురి విప్పిన మయూరిలా...
ఉషాకిరణాల తంత్రులు మీటిన....
ఉదయసంగీత రాగాలాపన...

ఆ సమయంలో...
ఆ నులివెచ్చని  వెలుతురులో...
మరో సౌందర్య భానూదయం...
తడిఆరని కురులు సవరించుకుంటూ
రమణీయ దృశ్య కావ్యం...

కురులు జారిన ఒక్కో నీటి తునక
ప్రభాత సంగమాన  ముత్యాల ముగ్గులే...
ఆ సూర్యుడినీ అడ్డుపెట్టిన నిశీధి కురుల మధ్య
అందమంతా దాచుకుందీ... నా కనులకందకుండా...

పిల్లతెమ్మెరల తాకిడికి రెపరెపలాడి...
కురుల పరదా తొలగినంతనే తొంగి చూశా...
ఆటు సూర్యబింబం... ఇటు పగలే చంద్రబింబం
ఆ వెన్నెల నుదుట మరో అరుణ బింబంలా
ఎర్రాని కుంకుమ బొట్టు... 

ఆ తడిసిన కురుల సుంగంధం...
పరిమళమెంతో మనసుకే తెలుసు...
ఓర చూపున చూస్తున్నాని ఆమెకు తెలుసు..
తెలిసి... తనలో నవ్వుకుని.. అక్కడే ఉండి..
గుండెలు పిండెనే.. ఇది తగునా లలనా...

కురులు పిండిన తడి.. అక్కడక్కడా తగిలి
అక్కడక్కడా తడిసి.. చీర అందం రెట్టింపయ్యే..
ఆ విన్యాసంలో కాస్త వంగి... సిగ్గుతో ఓరకంట..
నను గమనించి... ఠక్కున సవరించుకున్న
సన్నివేశం... మనసుకి రంపపు కోతే...

సవరించుకున్న చీర నడుమున దోపి..
చిరునవ్వులను పెదవి అంచునే దాచి..
చూసి చూడక... ఓరకంట కనిపెట్టి..
సౌందర్యారాధనకు అనుమతిచ్చిన..
ఓ ముగ్దమనోహరా... ధన్యోస్మి...
 
మనసు జంఝాటాలలో 
ఇది తనకో అనుభవం
నా మదికో మధుర సంతకం...




 

15 కామెంట్‌లు:

  1. మీ మధుర సంతక చంద్రోదయ కావ్యఝరి కడు కమనీయం. అందమైన అరుణోదయం.

    రిప్లయితొలగించండి
  2. దుష్టుడా... మధుర సంతకం దుష్ట సమాసం. :) ముగ్ధ మనోహరంగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి గురువు గారు. ఆడపిల్లను చూసి తడబడి... దుష్ట సమాస ప్రయోగం తప్పింది కాదు...

      తొలగించండి
  3. మీరూ గొప్ప భావకవులే. కవిత కమనీయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందాన్ని చూస్తే... కవిత్వం తన్నుకు రాదా చెప్పండి... మనసూరుకోదూ.....

      తొలగించండి
  4. ఇంతందంగా వ్రాసే మీరు అప్పుడప్పుడూ ఎందుకు వ్రాస్తారు , వ్రాస్తూ ఉండండి.

    రిప్లయితొలగించండి
  5. సతీష్ గారూ మెచ్చుకోవాల్సిందే .. నిజం గా ఆడపిల్లలు అందానికి మచ్చుతునకలే .. కానీ సౌందర్యారాధన లో మీ

    మగవారు చాలా గొప్పవారు సుమండీ .. ఎప్పుడో పాత రోజుల్లో పల్లె టూల్లలో కనిపించే అరుదైన సంప్రదాయం ..

    వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం .. ఇప్పటి ఆడపిల్లలకి అంత తీరిక లేదు కదండీ .. నిజంగా అలాంటి దృశ్యం ఈ

    రోజుల్లో మీరు వర్ణించి నంత అందం గా కనబడితే ఆ ఉదయం నిజంగా సౌందర్యోదయమే .. అదే మీరన్నట్టు

    భానోదయానా చంద్రోదయం .. మహర్షి సినిమా పాట గుర్తొచ్చింది అండీ .. కవిత చాలా బావుందండీ .. .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆడపిల్ల అందాన్ని పొగడాలంటే మేమే మరి. మీ అందానికి అందం కూడా మా పొగడ్తలే కదండీ..

      తొలగించండి
  6. ఓహో ఆహా.....మీ వాకిట్లో ఆడపిల్ల భలే అందమైందండోయ్ :-) కవిత చాలా నచ్చిందండి.

    రిప్లయితొలగించండి