Powered By Blogger

12 ఏప్రిల్, 2015

ఓ జ్ఞాపకం...









ఏనాడో మనసులో మిగిలిన ఓ జ్ఞాపకం

దాదాపుగా మరుపు ఆవహించిన జ్ఞాపకం
కళ్లెదుట నిలిచి గుర్తుచేసిందా జ్ఞాపకం
కాలచక్రాన్ని ఓ పదారేళ్లు వెనక్కు నెట్టిందా జ్ఞాపకం

ఆనాడు తొలిచూపుని ఆకర్షించిన సౌందర్యం
మనసుని మెలిపెట్టి గిలిగింతలు పెట్టిన కోమలం
ప్రతిరోజూ వసంతమే ఆ వదనం
ప్రేమో, వ్యామోహమో.. మొత్తానికి ఓ అనుభవం

వెంటపడిన రోజులు.. క్షణక్షణం మధురం
చిరునవ్వుల బదుళ్లు... పెంచిన విరహం
క్షణమొగ యుగమయ్యే నిరీక్షణల్లో ఏదో మర్మం
యుగమొక క్షణమే ఆమె కనిపించిన తరుణం

ఇరువురికీ తెలియదే.. అది ప్రేమోఏమో
అడిగిన మరుక్షణం ఏదో భయం... కలవరం
నాటి నుంచి నేటి వరకు ఏమైందో ఆ సౌందర్యం
మళ్లీ... కనిపించి మనసుని మెరిపించింది ఆ జ్ఞాపకం

చిరునవ్వులే పలకరింపుగా స్వగతం
కనుచూపులే పరిచయాల ఆలింగనం
చెరో జీవితం.. పక్కనే పేగు బంధం.. 

ఆనాడు ప్రేమో ఏమో... నేడది కచ్చితంగా స్నేహం

జ్ఞాపకాల దొంతరల్లో తిరిగిన కాలచక్రం
ఆనుభవాల ఇరుసుల మీద ఆగని ప్రయాణం
ప్రతి మనసులో ఓ అందమైన  అనుభవం
విజయమో, వైఫల్యమో... అదో తీయని జ్ఞాపకం

‍ 
 

10 కామెంట్‌లు:

  1. రోజులు ఏళ్ళుగా కరిగినా కాలం
    ఊహల తడి ఇంకని జ్ఞాపకం
    చిగురులు నిలుపుకున్న స్నేహం
    మనసును సేద దీర్చిన సంగమం

    బాగుంది సతీష్ గారు ...
    after a long time ...

    రిప్లయితొలగించండి
  2. ఈ ఒక్క జ్ఞాపకం కొన్ని వేల మధురానుభూతుల అమృతభాంఢంలా తోస్తుంది.
    మీ కలం ఎప్పుడో ఒకసారి ఇలా చిలికి మమ్మల్ని మైమరపించి మురిపిస్తుంది.
    చాలా రోజులకి రాసారు సతీష్ గారు....ఇక ఆపకండి, వ్రాస్తూనే ఉండండి.

    రిప్లయితొలగించండి
  3. ఇజీనారం గ్యాపకవా.... :)

    రిప్లయితొలగించండి
  4. మీ జ్ఞాపకాల సడి బాగున్నది

    రిప్లయితొలగించండి
  5. ఆనాడు ప్రేమో ఏమో... నేడది కచ్చితంగా స్నేహం-ఈ లైన్ నాకు అర్థం కాలేదు. మిగతా కవిత బాగుంది.

    రిప్లయితొలగించండి
  6. మరిన్ని జ్ఞాపకాలని పొందుపరచండి కవితారూపంలో బాగున్నాయి మీ అక్షరమాలలు.

    రిప్లయితొలగించండి
  7. అలనాటి మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ వీడనంతగా అల్లుకున్నాయా మిమ్మల్ని

    రిప్లయితొలగించండి
  8. జ్ఞాపకాల దొంతరల్లో తిరిగిన కాలచక్రం
    ఆనుభవాల ఇరుసుల మీద ఆగని ప్రయాణం..అందమైన జ్ఞాపకం

    రిప్లయితొలగించండి